మొన్నటి వరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ‘ఇరుముడి’ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. థియేటర్లలో సినిమా మిస్ అయినవారు ఇంటి వద్దే చూస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తుండడంతో వైరల్‌గా మారుతున్నాయి.
ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు..
ముఖ్యంగా పల్లెల్లో ‘ఇరుముడి’ని ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. వీధుల్లో పెద్ద స్క్రీన్లు పెట్టి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సినిమాను చూస్తున్న వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా కొన్ని గ్రామాల్లో వెండి తెరపై సినిమాను ప్రదర్శించడం విశేషంగా మారింది. థియేటర్లకు వెళ్లలేకపోయిన ప్రేక్షకులు ఇలా తమ గ్రామాల్లోనే సినిమాను చూసే అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘ఇరుముడి’ ఓటీటీలోనే జోరు చూపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి గ్రామల్లో ప్రదర్శనల వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
200 కోట్లకు పైగా కలెక్షన్లు
కాగా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన సినిమా 'ఇరుముడి'. తండ్రి కూతురు అనుబంధంతో తెరకెక్కిన స్టోరీకి అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని జోడించారు. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో విశేషాదరణ దక్కించుకుంది. దీంతో బాక్సాఫీసులో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ చిత్రం సెప్టెంబరు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదీ చదవండి: బిగ్‌బాస్ తొలి కెప్టన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా
Vizianagaram district devada village lo irumudi movie grama prajalu inkaa aadharisthunnaru. Vinayaka chavithi sandharbam gaa committee members ilaa grama prajaliki chupisthunnaru🙏🙏🙏#irumudimovie #mythrimoviemakers#gvprakash#raviteja#sivanirvana pic.twitter.com/xPBhrmbrlJ
— 𝗥𝗔𝗝𝗔𝗦𝗔𝗔𝗕 (@RAJU_BHAI_LUV) September 18, 2026


