మహిళల అభివృద్ధికి సెలబ్రిటీల సంచలన నిర్ణయం | Ranveer Singh Has Helped For Education Of 1,000 Girls Under The Seva Sankalp Abhiyan | Sakshi
Sakshi News home page

Seva Sankalp Abhiyan: మహిళల అభివృద్ధికి సెలబ్రిటీల సంచలన నిర్ణయం

Sep 18 2026 12:56 PM | Updated on Sep 18 2026 1:07 PM

Ranveer Singh Has Helped For Education Of 1,000 Girls Under The Seva Sankalp Abhiyan

మహిళల అభివృద్ధికి సెలబ్రిటీలు పెద్దపేట వేస్తున్నారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబరు 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ పేరుతో కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో పాల్గొనేందుకు సినీ ప్రముఖులు  పెద్ద ఎత్తున భాగమవుతున్నారు.
1000మంది మహిళలకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌
నిన్న( సెప్టెంబర్‌ 17) నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూనే సోషల్‌ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. 1000మంది మహిళలకు ఉచితంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ అందిస్తున్నట్లు ప్రకటించారు. 
ఇప్పుడు ఈ దశగానే బాలీవుడ్‌ యాక్టర్స్‌ సైతం అడుగులు వేశారు. తాజాగా ముంబైలోని లాల్‌బాడ్‌చా రాజాను దర్శించుకున్న రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌​, అలియా భట్‌ ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నారు.

‘సేవా సంకల్ప్‌ అభియాన్‌లో పాల్గొని 1000మంది బాలికలను చదివిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ పనిని వినాయకుడు నా వెనుక ఉండి నడిపిస్తాడని నమ్ముతున్నాను’ అని రణ్‌వీర్‌ తెలిపారు. అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ కూడా ముంబైలోని 20 పాఠశాలలను డెవలెప్‌మెంట్‌ చేసే బాధ్యతలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 

(ఇదీ చదవండి: రష్మికతో విజయ్‌ ‘ఎందయ్యా సామి’ సాంగ్‌ వచ్చేస్తోంది..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement