ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది.
(ఇదీ చదవండి: నటనకు ప్రాణం పెట్టిన తారలు.. కోట్లలో కలెక్షన్లు)
డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ ‘టైటిల్ విని మా నిర్మాతలు ఈ సినిమా ని ఒకే చేశారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కు మంచి ఆదరణ వచ్చింది. చాలా కష్టపడి ఈ సినిమాని తీర్చిదిద్దాం’ అని అన్నారు. ఖాన్ దురాని మాట్లాడుతూ.. ‘ ఈ సినిమాని సెప్టెంబర్ 18 బదులు సెప్టెంబర్ 25 కి రిలీజ్ చేస్తున్నాం. పారడైజ్ కి పోటీ వెళ్తున్నారా అని చాలామంది అడిగుతున్నారు. మేము ఎవ్వరికీ పోటీ వెళ్లడం లేదు. మొన్న జరిగిన ఈవెంట్ లో కూడా చెప్పా నాని అంటే నాకు చాలా ఇష్టం. ఆయనే నా ఇన్‌స్పిరేషన్’ అని అన్నారు.
(ఇదీ చదవండి: రష్మికతో విజయ్ ‘ఎందయ్యా సామి’ సాంగ్ వచ్చేస్తోంది..!)


