టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’ గురించే చర్చ జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దీనికి తగ్గట్టుగానే మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఈ తరహాలోనే చైన్నైలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నానీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సినిమా చూసి వచ్చాక..
నా కెరీర్‌లో నేను చాలా కష్టపడి చేసిన చిత్రమిది. ఓ మంచి కథని భోవోద్వేగాలతో తెరపైకి తీసుకొస్తున్నాం. సినిమాపై చాలా నమ్మకం ఉంది. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది. ఇప్పుడు నన్ను అంతా నాని అని పిలుస్తున్నారు. సినిమా చూసి వచ్చాక జడల్ అనే పేరుతో పిలుస్తారు. జడలతో షూటింగ్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో మహిళలకు హ్యాట్సాఫ్. ఎందుకంటే జీవితాంతం ఆ జడలతోనే ఉంటారు. కయాదు చాలా బాగా నటించింది. సుబ్బు అనే పాత్రకు నూరుశారం న్యాయం చేసింది’ అని అన్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో చరణ్ రీఎంట్రీ.. తొలిరోజే మళ్లీ షాక్..)
కాగా ట్రైలర్ లేకుండా డైరెక్ట్‌గా థియేటర్లలోకి వస్తుండడంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అనిరుద్ సంగీతం అందించాడు. మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇదీ చదవండి: సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎలా షూట్ చేస్తారో తెలుసా?


