37 అంటే..? | Allu Arjun Raaka Team Mysterious 37 Post Sends Fans Into a Frenzy | Sakshi
Sakshi News home page

37 అంటే..?

Sep 18 2026 3:40 AM | Updated on Sep 18 2026 3:40 AM

Allu Arjun Raaka Team Mysterious 37 Post Sends Fans Into a Frenzy

37 అంటే ఏంటి? సినిమాలోని ఏదైనా పాత్రకు సంబంధించిన నంబరా? హీరోకి కలిసొచ్చే నంబరా? అతని వయసా? అసలు... 37 అంటే ఏమిటి? అని అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’కి సంబంధించిన పోస్టర్‌లో ‘37’ కనిపించడమే ఈ చర్చకు కారణం. ఈ పోస్టర్‌ను ‘రాకా’ టీమ్‌ ‘ఎక్స్‌’ వేదికగా షేర్‌ చేసింది. దీంతో సినిమా లవర్స్, ముఖ్యంగా అల్లు అర్జున్‌ అభిమానులు ఈ ‘37’ అంటే ఏంటి? అని డీకోడ్‌ చేసే పనిలో పడ్డారు. 

ఈ నెల 21న ‘రాకా’ చిత్రదర్శకుడు అట్లీ పుట్టినరోజు. ఆ రోజు ఇవ్వనున్న అప్‌డేట్‌ను ఉద్దేశించే ఇలా ‘37’ అంటూ ‘రాకా’ మేకర్స్‌ తమ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబైలో జరుగుతోందని తెలిసింది. 

ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా, జాన్వీ కపూర్, మృణాల్‌ ఠాకూర్, రష్మికా మందన్నా కూడా ఈ చిత్రంలో భాగమయ్యారనే ప్రచారం సాగుతోంది. అలాగే ఈ చిత్రంలో తాత, తండ్రి, ఇద్దరు కొడుకులు.. .ఇలా నాలుగు విభిన్నమైన గెటప్స్‌లో అల్లు అర్జున్‌ కనిపిస్తారని భోగట్టా. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ‘రాకా’ చిత్రం 2027 డిసెంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement