సూర్య ఫేవరేట్ రోల్.. తెలుగు టీజర్ చూశారా? | Kollywood Hero Suriya Latest Movie Scene Telugu Teaser Out now | Sakshi
Sakshi News home page

Scene Telugu Teaser: సూర్య కొత్త సినిమా.. తెలుగు టీజర్ వచ్చేసింది

Sep 17 2026 7:37 PM | Updated on Sep 17 2026 8:20 PM

Kollywood Hero Suriya Latest Movie Scene Telugu Teaser Out now

కోలీవుడ్ హీరో సూర్య ఇటీవల సూపర్ హిట్ అందుకున్నారు. వెంకీ ‍అట్లూరి డైరెక్షన్‌లో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్‌గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్‌ ఎంజాయ్ చేస్తుండగానే మరో సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా సూర్య కొత్త మూవీ టీజర్ కూడా వచ్చేసింది.

ప్రస్తుతం సూర్య.. జితు మాధవన్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి సీన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే సూర్య మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌లోని సీన్స్ సింగం-2 మూవీని తలపించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో సూర్య సరసన నజ్రియా హీరోయిన్‌గా కనిపించనుండగా.. నస్లెన్‌, ఆనంద్‌రాజ్‌, లాల్‌, రాజ్‌ ప్రియన్‌  కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నట్లు టీజర్‌లోనే రివీల్ చేశారు. ఈ మూవీని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో జ్యోతిక, సూర్యనే  నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సుసిన్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement