ఇద్దరు స్నేహితుల కథ ఇది: దర్శకుడు విశ్వనాథ్‌ రెడ్డి | Director Viswanath Reddy about Secret Soldier movie | Sakshi
Sakshi News home page

ఇద్దరు స్నేహితుల కథ ఇది: దర్శకుడు విశ్వనాథ్‌ రెడ్డి

Sep 18 2026 3:46 AM | Updated on Sep 18 2026 3:45 AM

Director Viswanath Reddy about Secret Soldier movie

నిహాల్‌ కోదాటి, సూర్య శ్రీనివాస్‌ హీరోలుగా అక్కి విశ్వనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీక్రెట్‌ సోల్జర్‌’. మూన్‌ లైట్‌ డ్రీమ్స్‌ బ్యానర్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అక్కి విశ్వనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘స్నేహం, దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రం ఇది. నెల్లూరులోని ఇద్దరు స్నేహితుల్లో ఒకరు స్పై కావాలనుకుంటే, మరొకరు తనకు హ్యాపీ లైఫ్‌ ఉంటే చాలనుకుంటాడు. ఈ రెండుపాత్రల మధ్య సాగే సినిమా ఇది. చైనాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేశాను. 

నేను గమనించిన ఓ ఘటనను ఆధారంగా చేసుకుని అల్లిన కల్పిత కథ ఇది. తొలుత మా సినిమాకు ‘చైనా పీస్‌’ అనే టైటిల్‌ అనుకున్నాం. సెన్సార్‌ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ‘సీక్రెట్‌ సోల్జర్‌’గా మార్చాం. ఇక ఈ సినిమా సబ్జెక్ట్‌ను ముందు కొంతమంది నిర్మాతలకు చెప్పగా, వారికి నచ్చింది. కానీ స్టార్‌ హీరోలు చేస్తేనే బాగుంటుందని అభి్ర΄ాయపడ్డారు. అయితే స్టార్‌ హీరోలు చేస్తే కథ ఉద్దేశం పక్కదారి పడుతుందేమోనని అనిపించింది. దీంతో మనల్ని మనమే నమ్ముకోవాలని నేనే ఈ సినిమాను నిర్మించాను’’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement