breaking news
Secret Soldier Movie
-
‘సీక్రెట్ సోల్జర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: సీక్రెట్ సోల్జర్నటీనటులు:నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, తులసి, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్.నిర్మాణ సంస్థ: మూన్ లైట్ డ్రీమ్స్రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాధ రెడ్డిసంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతుఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్విడుదల తేది: సెప్టెంబర్ 18, 2026కథేంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన మీరావలి అలియాస్ వలి (నిహాల్ కోదాటి), పృథ్వి (సూర్య శ్రీనివాస్) ప్రాణ స్నేహితులు. వలికి దేశభక్తి ఎక్కువ. అయినా కూడా మతం కారణంగా అందరూ అతని దేశ భక్తిని అనుమానిస్తుంటారు. దీంతో తన దేశభక్తిని చాటేందుకు ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటాడు. కానీ అది చేజారిపోతుంది. దీంతో ‘రా’(Raw)లో చేరాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే.. ఇతనిపై ఉగ్రవాది అనే ముద్రపడుతుంది. ఇండియా కి సంబధించిన ఓ కీలక ఇన్ఫర్మేషన్ లీక్ చేయడంలో వలి పాత్ర ఉందని అనుమానిస్తారు. ‘రా’ అధికారులు తమదైన శైలీలో విచారణ చేపట్టగా.. సంచలన విషయాలు తెలుస్తాయి. అవేంటి? కీలకమైన డిఫెన్స్ సమాచారం లీకేజీ వెనుక ఉన్న కుట్రదారులు ఎవరు? వారి లక్ష్యం ఏంటి? దేశం కోసం వలి ఏం చేశాడు? వలికి సంబంధించిన కీలక సమాచారం తెలిసిన తర్వాత పృథ్వి ఏం చేశాడు? ఇద్దరు మిత్రులు ఈ మిషన్‌లో ఎలా భాగమయ్యారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. స్నేహం, దేశభక్తి.. ఈ రెండు ఎమోషన్స్‌తో తెరకెక్కిన చిత్రమే సీక్రెట్ సోల్జర్. ఇండియా కి సంబధించిన ఓ కీలక ఇన్ఫర్మేషన్ లీకైన సంఘటనకు, నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లకి లింక్ ఏమిటి? ఆ సమస్యను పరిష్కరించగలిగారా లేదా? అనేది ఈ సినిమా కథ. దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి ఈ స్పై యాక్షన్ డ్రామాను చాలా డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. స్పై డ్రామా సినిమాల్లో కనిపించే హంగులేవి ఇందులో కనిపించవు.ఫస్టాఫ్ అంతా ఇద్దరు స్నేహితుల చుట్టూనే తిరుగుతుంది. విభిన్నమైన నేపథ్యలు ఉన్న ఈ ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఊర్లో సాదాసీదాగా తిరిగే ఈ ఇద్దరు కుర్రాళ్లు.. డిఫెన్స్ సమాచారం లీకేజీ ఇష్యూలోకి ఎలా వచ్చారనేది సహజంగా చూపించారు.ఇక సెకండాఫ్ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఉగ్రవాదుల మిషన్‌ని అడ్డుకునేందుకు ‘రా’టీమ్ చేసే ప్రయత్నాలు..ఇందులో స్నేహితులిద్దరూ భాగమయ్యే తీరు, వాళ్లు చేసే సాహసాలు అన్ని ఆకట్టుకుంటాయి. అయితే దర్శకుడు హీరో క్యారెక్టర్ని తీర్చిదిద్దిన విధానం బాగోలేదు. ఒక స్పైగా అతన్ని చూపించి.. శత్రువుల చేతుల్లో ఎప్పుడూ ఓ పావులాగే మారేలా చేశారు. ఆ పాత్ర చేసే సాహసాల కంటే శత్రువులు వేసిన ఎత్తుగడలే గొప్పగా చూపించారు. అలాగే దేశభద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలను శత్రువులు తస్కరించే తీరు కూడా మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే కొంతమంది గూఢచారుల జీవితాలు ఎలా ముగుస్తాయి? వాళ్లకు దక్కే గుర్తింపు ఎలా ఉంటుంది? అనేది ఇందులో చూపించిన తీరు బాగుంది. కథను మరింత బలంగా రాసుకొని.. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. దేశభక్తి ఎక్కువగా ఉన్న వలి పాత్రలో నిహాల్ కోదాటి చక్కగా నటించాడు. ఇక ధనవంతుడి కొడుకుగా సూర్య శ్రీనివాస్ ఒదిగిపోయాడు. వీరిద్దరు స్నేహబంధం ఈ సినిమాకు ప్లస్ అయింది. నిజమైన ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా ఉంటారు? ఎలా మాట్లాడుకుంటారు? ఆపద వస్తే ఎలా ఆదుకుంటారు? అనేది చాలా సహజంగా చూపించారు. హర్షిత బండ్లమూరి, శిరీష నూలుతో పాటు రఘుబాబు, తులసి, వడ్లమాని శ్రీనివాస్, శ్రీకాంత్ అయ్యంగార్, కమల్ కామరాజు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
ఇద్దరు స్నేహితుల కథ ఇది: దర్శకుడు విశ్వనాథ్ రెడ్డి
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అక్కి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘స్నేహం, దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రం ఇది. నెల్లూరులోని ఇద్దరు స్నేహితుల్లో ఒకరు స్పై కావాలనుకుంటే, మరొకరు తనకు హ్యాపీ లైఫ్ ఉంటే చాలనుకుంటాడు. ఈ రెండుపాత్రల మధ్య సాగే సినిమా ఇది. చైనాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేశాను. నేను గమనించిన ఓ ఘటనను ఆధారంగా చేసుకుని అల్లిన కల్పిత కథ ఇది. తొలుత మా సినిమాకు ‘చైనా పీస్’ అనే టైటిల్ అనుకున్నాం. సెన్సార్ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ‘సీక్రెట్ సోల్జర్’గా మార్చాం. ఇక ఈ సినిమా సబ్జెక్ట్‌ను ముందు కొంతమంది నిర్మాతలకు చెప్పగా, వారికి నచ్చింది. కానీ స్టార్ హీరోలు చేస్తేనే బాగుంటుందని అభి్ర΄ాయపడ్డారు. అయితే స్టార్ హీరోలు చేస్తే కథ ఉద్దేశం పక్కదారి పడుతుందేమోనని అనిపించింది. దీంతో మనల్ని మనమే నమ్ముకోవాలని నేనే ఈ సినిమాను నిర్మించాను’’ అని చెప్పారు. -
'సీక్రెట్ సోల్జర్.. కొత్త అనుభూతినిచ్చే స్పై డ్రామా సినిమా'
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన స్పై డ్రామా సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలని పెంచింది. ఈ శుక్రవారమే అంటే సెప్టెంబర్ 18న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిహాల్, సూర్య శ్రీనివాస్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)'చైనా పీస్’గా మొదలైన ప్రయాణం ‘సీక్రెట్ సోల్జర్’గా ఎలా మారింది?‘చైనా పీస్’ పేరుతోనే టీజర్ రిలీజ్ చేశాం. అలాగే రెండు పాటలు కూడా విడుదల చేశాం. అదే పేరుతో చాలా మార్కెటింగ్ చేశాం. మార్చిలో సినిమా రిలీజ్ చేద్దామని సెన్సార్‌కు పంపించాం. సెన్సార్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. రివ్యూ కమిటీలు, ఈబీసీ చైర్మన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్.. ఇలా అన్ని స్థాయిలు దాటుకుని లిస్ట్ పంపించారు. అందులో మొదటి పాయింట్.. టైటిల్ ‘చైనా పీస్’ ఉండకూడదు. ఈ కథ ఆలోచన, ఉద్దేశంతో ఆలోచించుకుని ‘సీక్రెట్ సోల్జర్’ అయితే బాగుంటుందని ఆ టైటిల్ పెట్టాం.సెన్సార్‌లో దాదాపు 8 నెలలు ఈ సినిమా ఉన్నప్పటికీ, మేం ఏ ఆలోచనతో సినిమా తీశామో.. ఆ ఆలోచన విషయంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. మా డైరెక్టర్ విశ్వనాథ్ చాలా కష్టపడ్డారు. కంటెంట్ విషయంలో తగ్గించడానికి ఎక్కడా కూడా రాజీ పడలేదు. విజువల్స్ పరంగా చాలా చిన్న కట్స్ మాత్రమే వచ్చాయి. ఇండియాకి సంబధించిన ఓ కీలక సమాచారం లీకవుతుంది. ఆ సంఘటనకి నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లకి లింక్ ఏమిటి? ఆ సమస్యని పరిష్కరించగలిగారా లేదా? అనేది స్టోరీ లైన్. స్నేహం, దేశభక్తి ఈ రెండు ఎమోషన్స్‌తో ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇందులో అలాంటి ఒక కొత్త ఎమోషన్‌ను ఆడియన్స్ చూడబోతున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు.(ఇదీ చదవండి: నా అందానికి సీక్రెట్ అదే: హీరోయిన్ శ్రియ) -
స్పై డ్రామా సినిమా 'సీక్రెట్ సోల్జర్' ట్రైలర్ రిలీజ్
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా చేసిన సినిమా 'సీక్రెట్ సోల్జర్'. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకుడు. స్పై డ్రామా కథతో దీన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 18న మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను, రైటర్ బీవీఎస్ రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ.. “సీక్రెట్ సోల్జర్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సెన్సార్లోనే 8 నెలల పాటు ఈ సినిమా ఉందని విన్నాను. కచ్చితంగా అందరికీ నచ్చడం వల్లే సెన్సార్ నుంచి బయటకు వచ్చింది. నిర్మాత ఈ మూవీ కోసం తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చుపెట్టి తీశారు. ఖచ్చితంగా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.హీరో నిహాల్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు వెళ్లిన సినిమాల్లో ‘దురంధర్’, సల్మాన్ ఖాన్ సినిమా, మూడోది మా సినిమా. అంత పెద్ద సినిమా ఇది. మా సినిమాలో ఉన్న ఐడియా, ఎఫర్ట్, విజువల్‌ను చూడండి. చాలా అద్భుతమైన సినిమా తీశామని చెప్పుకొచ్చాడు.


