నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన స్పై డ్రామా సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలని పెంచింది. ఈ శుక్రవారమే అంటే సెప్టెంబర్ 18న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిహాల్, సూర్య శ్రీనివాస్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)
'చైనా పీస్’గా మొదలైన ప్రయాణం ‘సీక్రెట్ సోల్జర్’గా ఎలా మారింది?
‘చైనా పీస్’ పేరుతోనే టీజర్ రిలీజ్ చేశాం. అలాగే రెండు పాటలు కూడా విడుదల చేశాం. అదే పేరుతో చాలా మార్కెటింగ్ చేశాం. మార్చిలో సినిమా రిలీజ్ చేద్దామని సెన్సార్‌కు పంపించాం. సెన్సార్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. రివ్యూ కమిటీలు, ఈబీసీ చైర్మన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్.. ఇలా అన్ని స్థాయిలు దాటుకుని లిస్ట్ పంపించారు. అందులో మొదటి పాయింట్.. టైటిల్ ‘చైనా పీస్’ ఉండకూడదు. ఈ కథ ఆలోచన, ఉద్దేశంతో ఆలోచించుకుని ‘సీక్రెట్ సోల్జర్’ అయితే బాగుంటుందని ఆ టైటిల్ పెట్టాం.
సెన్సార్‌లో దాదాపు 8 నెలలు ఈ సినిమా ఉన్నప్పటికీ, మేం ఏ ఆలోచనతో సినిమా తీశామో.. ఆ ఆలోచన విషయంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. మా డైరెక్టర్ విశ్వనాథ్ చాలా కష్టపడ్డారు. కంటెంట్ విషయంలో తగ్గించడానికి ఎక్కడా కూడా రాజీ పడలేదు. విజువల్స్ పరంగా చాలా చిన్న కట్స్ మాత్రమే వచ్చాయి. ఇండియాకి సంబధించిన ఓ కీలక సమాచారం లీకవుతుంది. ఆ సంఘటనకి నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లకి లింక్ ఏమిటి? ఆ సమస్యని పరిష్కరించగలిగారా లేదా? అనేది స్టోరీ లైన్. స్నేహం, దేశభక్తి ఈ రెండు ఎమోషన్స్‌తో ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇందులో అలాంటి ఒక కొత్త ఎమోషన్‌ను ఆడియన్స్ చూడబోతున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు.
(ఇదీ చదవండి: నా అందానికి సీక్రెట్ అదే: హీరోయిన్ శ్రియ)


