చిరంజీవి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది | Delulu Movie Teaser Release Event | Sakshi
Sakshi News home page

Delulu Movie: డెలులు టీజర్ రిలీజ్.. సందడిగా ఈవెంట్

Sep 5 2026 11:56 AM | Updated on Sep 5 2026 12:03 PM

Delulu Movie Teaser Release Event

ప్రీతం కస్తూరి దర్శకత్వంలో సంకీర్త్ కొండ నిర్మాతగా చేసిన తెలుగు సినిమా 'డెలులు'. విజయ రాజ్ కుమార్, వేణి రావు, సాయి ప్రసన్న, అఖిల్ జాక్సన్, శ్రీరామ మండవ కీలక పాత్రలు చేశారు. ఆది చేబ్రోలు సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నేటి జెన్ జీ యువతకు దగ్గరగా ఉండేలా తీర్చిదిద్దారు. తాజాగా హైదరాబాద్‌లో టీజర్ లాంచ్ చేశారు.

(ఇదీ చదవండి: కృష్ణాష్టమి రోజున శుభవార్త.. బిగ్‌బాస్ జంటకు మరో కూతురు)

హీరో విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. 'నేను 10 నిమిషాల కథ ఫోన్ కాల్‌లో చెప్పగానే సంకీర్త్ కొండ నిర్మించడానికి ముందుకొచ్చారు. ఇప్పటివరకు ఎవరూ సాహసించని కథని ‘డెలులు’ ద్వారా చెప్పబోతున్నాం. నా తొలి సినిమా సమయంలో మెగాస్టార్ చిరంజీవి నన్ను అభినందిస్తూ మెసేజ్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఒకసారి చిరంజీవి పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూసి, “చిరంజీవి గారు నన్ను హీరోగా నమ్ముతున్నప్పుడు నేను కూడా నన్ను నమ్మాలి” అని భావించాను. ఆ ఆలోచనతోనే మళ్లీ కొత్తగా మొదలుపెట్టాను. ఇప్పుడు ‘డెలులు’తో వస్తున్నాను. చిరంజీవి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది" అని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: చాపచుట్టేసిన 'టాక్సిక్'.. 450 టికెట్స్ మాత్రమే విక్రయం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement