9 ఏళ్ల వయసులో 'భరతనాట్యం'.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ | Sreeleela 9 Years Dance Video Post On Krishnastami | Sakshi
Sakshi News home page

Guess The Actress: క్లాసికల్ డ్యాన్స్ వీడియోతో సర్‍‌ప్రైజ్.. ఈమెని గుర్తుపట్టారా?

Sep 5 2026 10:00 AM | Updated on Sep 5 2026 10:04 AM

Sreeleela 9 Years Dance Video Post On Krishnastami

శుక్రవారం అంతటా కృష్ణాష్టమి వేడుకల్ని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది తమ పిల్లల్ని కృష్ణుడిగానో రాధలానే ముస్తాబు చేసి మురిసిపోయారు. ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రం తనకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు అద్భుతంగా చేసిన భరతనాట్యం డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ వీడియోని పోస్ట్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా?

(ఇదీ చదవండి: అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ)

పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు శ్రీలీల. అవును గుంటూరు కారం, ధమాకా సహా తెలుగులో చాలా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. అయితే కృష్ణాష్టమి సందర్భంగా తన తల్లి వాట్సాప్ గ్రూపులో ఈ వీడియో షేర్ చేసిందని, దీనిని సోషల్ మీడియాలోనూ తనకు పోస్ట్ చేయాలనిపించి ఇన్ స్టాలో పెట్టానని శ్రీలీల దీనికి క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. శ్రీలీల క్లాసికల్ కూడా భలే చేస్తుందే అని మాట్లాడుకుంటున్నారు.

తెలుగమ్మాయి అయినప్పటికీ బెంగళూరులో పెరిగిన శ్రీలీల.. కన్నడ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. 'పెళ్లి సందడి' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై 'ధమాకా'తో హిట్ కొట్టినప్పటికీ స్కంద, గుంటూరు కారం, రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ తదితర మూవీస్ చేసింది. వీటిలో 'భగవంత్ కేసరి' మాత్రమే ఉన్నంతలో సక్సెస్ అయింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పెద్దగా మూవీస్ లేవు. తమిళంలో ధనుష్‌తో చేసిన 'ఓం', అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఓ హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి సక్సెస్ అయినదానిబట్టి శ్రీలీల కెరీర్ ఆధారపడి ఉంటుంది.

(ఇదీ చదవండి: నడుము గిల్లే సీన్ చేయనంది.. 'బేబి' చూసి షాకయ్యా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement