వాళ్ల వల్లే ఇప్పుడిలా ఉన్నాను: శ్రీలీల | Sreeleela Opens Up On Fans Unconditional Love And Her Exciting Lineup Of Latest Movies, Deets Inside | Sakshi
Sakshi News home page

Sreeleela: అభిమానుల ప్రేమకు శ్రీలీల ఫిదా

Aug 19 2026 8:55 AM | Updated on Aug 19 2026 10:21 AM

Sreeleela Reacts Her Fans Love And Latest Movies

దక్షిణాది ప్రేక్షకుల్ని అలరిస్తున్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. మాతృభాష అయిన కన్నడ చిత్రాలతో కెరీర్‌ ప్రొరంభించి తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'పెళ్లి సందడి'తో మొదలుపెట్టి వరసగా సినిమాలు చేసింది. అందం, డ్యాన్స్‌లతో కురక్రారు మతి పోగొట్టింది. 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ చేసి పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది తమిళంలో పరాశక్తి, తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ చేసింది.

ప్రస్తుతం ధనుష్‌కు జంటగా 'ఓం' సినిమాలో శ్రీలీల ఓ హీరోయిన్. త్వరలో ఈమె నటించిన హిందీ మూవీ కూడా రిలీజ్ కానుంది. అయితే తాను ఇలా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి అభిమానులే కారణమని చెబుతోంది. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అభిమానులని ప్రత్యక్షంగా కలిసినప్పుడు వారు చూపించే ఆదరాభిమానాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నేను డబ్బు సంపాదిస్తున్నప్పుడు, పేరు తెచ్చుకున్నప్పుడు కూడా ఇంత సంతోషపడలేదు. అభిమానులు వల్ల మాత్రమే అంతా సాధ్యం అవుతోంది. ఇంత ప్రేమ పొందడానికి ప్రాప్తి ఉండాలి. అందుకు నటిగా నేను గర్వపడుతున్నాను అని శ్రీలీల పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement