దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ డైరెక్షన్‌లో వచ్చిన డెబ్యూ మూవీ సిగ్మా. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటించారు. దర్శకుడిగా జేసన్‌కు మొదటి సినిమా కావడంతో విజయ్ అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ మూవీ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలైంది.
అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సిగ్మా బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశపరస్తోంది. రెండు రోజుల్లో కలిపి దేశవ్యాప్తందా కేవలం రూ. 4.40 కోట్లు మాత్రమే రాబట్టింది. నెట్ వసూళ్లపరంగా చూస్తే రూ. 3.85 కోట్లు సాధించింది. ట్రేడ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ప్రకారం రెండో రోజు ఈ మూవీ కేవలం రూ.1.50 కోట్ల వసూళ్లు మాత్రమే కలెక్ట్ చేసింది. రెండవ రోజు తమిళ వర్షన్ రూ. 95 లక్షల నికర వసూళ్ల రాబట్టగా.. తెలుగు వర్షన్ రూ. 55 లక్షలు మాత్రమే సాధించింది. శనివారం థియేటర్లలో కేవలం 19 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు చేసింది.
కాగా.. ఈ చిత్రంలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ, అప్పు తీర్చడానికి ప్రయత్నించే ఒక లైబ్రేరియన్ కథే ఈ సిగ్మా. అతని పరిస్థితులు చివరికి అతన్ని డ్రగ్ డీలర్లు, అక్రమ క్యాసినోలు, దోపిడీలతో ప్రమాదకరమైన నేర ప్రపంచంలోకి ఎలా వెళ్లారనేదే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.


