మెగాస్టార్ విశ్వంభర.. రిలీజ్‌ ఆ పండుగకేనా? | Vishwambhara Release Update, Chiranjeevi Fantasy Film Reportedly Eyeing Shivaratri 2027 Release After Kaaka | Sakshi
Sakshi News home page

Chiranjeevi: మెగాస్టార్ విశ్వంభర.. రిలీజ్‌ అప్పుడేనా?

Oct 5 2026 10:35 AM | Updated on Oct 5 2026 11:12 AM

Megastar Chiranjeevi Vishwambhara expected Release date on this day

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది రిలీజ్‌ కావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. దసరాకు రిలీజ్ అవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఇంకెప్పుడా అని ‍అప్‌డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే విశ్వంభరకు సంబంధించిన ఓ క్రేజీ టాక్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో వైరల్‌గా మారింది. తాజాగా వినిపిస్తోన్న బజ్ ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుందని తెలుస్తోంది. సంక్రాంతి బరిలో ఉన్న  కాకా తర్వాతే విశ్వంభర రానుందని గట్టిగా టాక్ వినిపిస్తోంది.

వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి బరిలో కాకా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చే శివరాత్రికి విశ్వంభర రిలీజ్‌ చేయనున్నట్లు కనిపిస్తోంది. మొదట ఈ ఏడాది దీపావళికి నవంబర్‌లో వస్తుందని అభిమానులు భావించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు. అందుకే వచ్చే ఏడాది శివరాత్రిపైనే మేకర్స్ గురిపెట్టారని తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అప్పుడైనా రిలీజ్‌ అయితే మెగా ఫ్యాన్స్‌ పండగే పండగ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement