మూస చిత్రాలకు భిన్నంగా 'రాజిగాడు రాజయ్యాడు' | Rajigadu RajAyya Movie Teaser Launch Event | Sakshi
Sakshi News home page

అల్తాఫ్ హసన్ చరిత్ర సృష్టించబోతున్నాడు: గోరటి వెంకన్న

Nov 19 2026 8:33 PM | Updated on Nov 19 2026 8:40 PM

Rajigadu RajAyya Movie Teaser Launch Event

"బట్టల రామస్వామి బయోపిక్కు" సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్తాఫ్ హసన్.. నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ "రాజిగాడు రాజయ్యాడు". బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. అను శ్రీ హీరోయిన్ కాగా ప్రముఖ కవి, గాయకుడు డా.గోరటి వెంకన్న కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గురువారం జరిగింది.

(ఇదీ చదవండి: కూతురి గురించి తప్పుడు రూమర్స్.. హీరో అర్జున్ సర్జా ఆగ్రహం)

హీరో, డైరెక్టర్ అల్తాఫ్ హసన్ మాట్లాడుతూ.. విజయ్ భాస్కర్ రాసిన నాటకం ఈ సినిమాకు మూలం. పల్లె కన్నీరు పెడుతుందో అనే గొప్ప పాట రాసిన గోరటి గారే ఈ సినిమాకు అలాంటి పాట రాయగలరని ఆయనను అప్రోచ్ అయ్యాం. మా నాన్న పాత్ర కూడా ఆయనే చేయాలని కోరాం. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. నేను ఈ సినిమా మూడుసార్లు చూశా. అస్సలు బోర్ కొట్టలేదు. మూస చిత్రాలు భిన్నంగా అల్తాఫ్ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడని అన్నారు. 

(ఇదీ చదవండి: పెళ్లిలో కావ్య కోసం పాట పాడిన అనిరుధ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement