తమిళ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని అయిన కావ్య మారన్‌ని పెళ్లి చేసుకున్నాడు. పదిరోజుల క్రితం అంటే నవంబర్ 10-11 తేదీల్లో గ్రీస్ వేదికగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. అయితే పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తపడ్డారు. కావ్యకు సోషల్ మీడియాలో అకౌంట్స్ లేకపోవడంతో అనిరుధ్ మాత్రమే సదరు ఫొటోలని పోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని పిక్స్ షేర్ చేశాడు.
(ఇదీ చదవండి: ‘లైఫ్ ఇచ్చినోడినే మర్చిపోయావా..?’ అనిరుధ్‌పై ఫైర్)
ఇందులో భాగంగా సంగీత్‌లో కావ్య కోసం అనిరుధ్ లవ్ సాంగ్ పాడాడు. బంగారు వర్ణ దుస్తల్లో పెళ్లి కొడుకు-కూతురితో పాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా ధగధగా మెరిసిపోయారు. నా జీవితంలో జరిగిన ఫేవరెట్ మ్యాజిక్ ఇదేనని చెబుతూ అనిరుధ్ ఈ ఫొటోలని పంచుకోవడం విశేషం.
(ఇదీ చదవండి: కూతురి గురించి తప్పుడు రూమర్స్.. హీరో అర్జున్ సర్జా ఆగ్రహం)





