పెళ్లి చేసుకున్న తమిళ హీరోయిన్.. ఫొటోలు | Actress Mirnalini Ravi Marriage Latest Pics And Details | Sakshi
Sakshi News home page

Mirnalini Ravi Marriage: డెస్టినేషన్ వెడ్డింగ్.. హీరోయిన్ పెళ్లి ఫొటోలు

Nov 16 2026 6:40 PM | Updated on Nov 16 2026 6:42 PM

Actress Mirnalini Ravi Marriage Latest Pics And Details

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు నిశ్చితార్థం, పెళ్లి చేసుకుని ఫొటోలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడీ లిస్టులోకి తెలుగు, తమిళ సినిమాలు చేసిన హీరోయిన్ మిర్నాళిని రవి కూడా చేరిపోయింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌తో కొత్త జీవితం ప్రారంభించింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఆరు డోంట్ మిస్)

ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న తమిళ హీరోయిన్ మిర్నాళిని రవి.. ప్రియుడు, మలేసియాకు చెందిన మహావిష్ణు అనే ఆధ్యాత్మిక గురువుతో ఆదివారం(నవంబర్ 15) ఏడడుగులు వేసింది. మలేసియా దగ్గరలోని లంగకవి ఐలాండ్ ఈ శుభకార్యానికి వేదికైంది. పెళ్లికొడుకు-పెళ్లికూతురు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం మిర్నాళిని-మహావిష్ణు ఒక్కటయ్యారు. పెళ్లి ఫొటోలని మిర్నాళిని.. తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

పుదుచ్చేరికి చెందిన మిర్నాళిని.. 2019లో వచ్చిన విజయ్ సేతుపతి 'సూపర్ డీలక్స్'తో నటిగా పరిచయమైంది. తర్వాత 'గద్దలకొండ గణేశ్'తో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామ మశ్చీంద్ర మూవీస్ కూడా టాలీవుడ్‌లో చేసింది. తమిళంలో ఛాంపియన్, ఎనిమీ, ఎమ్జీఆర్ మగన్, జంగో, కోబ్రా తదితర మూవీస్ చేసింది. చివరగా 2024లో 'రోమియో' అనే తమిళ చిత్రంలో కనిపించింది.

(ఇదీ చదవండి: హీరో తేజా సజ్జా నిశ్చితార్థం.. కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement