సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి’. వీరిద్దరి కలయికలో వస్తోన్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అప్పుడెప్పుడో టైటిల్ రివీల్ చేస్తూ ఓ వీడియో విడుదల చేసిన రాజమౌళి ఇప్పటి వరకు మరో అప్‌డేట్ అనే మాటేలేకుండా ఉన్నారు. దీంతో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎక్స్ వేదికగా
ఈ నేపథ్యంలో చిత్రబృందం ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ‘‘వారణాసి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సీజీఐ, రీ రికార్డింగ్ పనులు కొనసాగుతున్నాయి.డబ్బింగ్ ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ఇదే అప్‌డేట్ అనుకోండి. లేదంటే అసలైన బ్లాస్ట్ కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడండి’ అంటూ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అయితే సినిమా విడుదలకు దగ్గర పడతుండడంతో వచ్చే జనవరి లోపల బిగ్ అప్‌డేట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 7న
కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
(ఇదీ చదవండి: ఆ రోజు తండ్రికి కొడుకే పోటీ.. నెగ్గేదెవరో..?)
@PVallipair72764 Shooting ayipoyindi. Post Production avuthundi… CG works going on. RR Going on… Dubbing start cheyyaali… If you think this is an update, its an update. If not, you have to wait for a bit for the blast.💥 ☄️
— Varanasi (@VaranasiMovie) November 15, 2026


