బాలనటుడిగా అందరికీ తెలిసిన తేజా సజ్జా.. 'హనుమాన్' మూవీతో హీరోగా పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రియాలటీ షోకి హోస్ట్‌గానూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సోమవారం ఈ శుభకార్యం జరగ్గా.. సినీ రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరుల్ని ఆశీర్వదించారు. ఈ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఆరు డోంట్ మిస్)
అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
తేజా సజ్జా నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పేరు మౌర్య. ఈమెకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. హైదరాబాద్‌కే చెందిన ఈమె.. అమెరికాలో పెరిగింది. ప్రస్తుతం అక్కడ తన తండ్రి టెక్ కంపెనీలో పనిచేస్తోంది. మరోవైపు తేజా సజ్జా కుటుంబానికి కూడా సినిమా, రాజకీయాలతో సంబంధం లేదు. అయితే వీళ్లిద్దరిదీ పెద్దలు కుదిర్చిన సంబంధమా? లేదంటే ప్రేమ వివాహమా అనేది తెలియాల్సి ఉంది.
పెళ్లి ఎప్పుడు?
ప్రస్తుతం అంతటా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కొన్నిరోజుల క్రితమే సాయిధరమ్ తేజ్ కూడా తన చిన్ననాటి స్నేహితురాలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. వచ్చే నెల 10న వివాహం జరగనుంది. తేజా సజ్జా కూడా వచ్చే నెలలోనే పెళ్లి చేసుకుంటాడా? లేదే వచ్చే ఏడాది కొత్త జీవితం ప్రారంభిస్తాడా అనేది చూడాలి? ప్రస్తుతం తేజా మిరాయ్, జాంబీ రెడ్డి సీక్వెల్స్ చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: సినిమా కోసం నిజంగానే జుత్తు కత్తిరించుకున్నా: సాయిపల్లవి)



