అమితాబ్‌ పోస్ట్‌.. ఆ రెండు పదాల వెనుక కారణమేంటి? | Amitabh Bachchan Recent Post On X | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan : అర్ధరాత్రి అమితాబ్‌ పోస్ట్‌.. కారణమేంటి?

Nov 16 2026 3:03 PM | Updated on Nov 16 2026 3:11 PM

Amitabh Bachchan Recent Post On X

గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ సినీ ప్రముఖులకు బెదిరింపులు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ చేసిన ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన కేవలం రెండు పదాలతో చేసిన వ్యాఖ్య అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

బతికి బయటపడ్డాం అంటూ..
నవంబర్‌ 15న అర్ధరాత్రి అమితాబ్‌ తన ఎక్స్‌ ఖాతాలో ‘బతికి బయటపడ్డా’ అంటూ పోస్ట్‌ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? అసలు ఏం జరిగింది? అనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇదే సమయంలో ఆయన నివాసం జల్సాపై దాడికి కుట్ర జరిగినట్లు వార్తలు రావడంతో ఈ పోస్ట్‌ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.దీనిపై అమితాబ్‌ నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.

మరోవైపు ముంబయిలోని అమితాబ్‌ నివాసం జల్సా బయట కాల్పులు జరిపేందుకు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన కొందరు వ్యక్తులు కుట్ర పన్నినట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానిత షూటర్లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

(ఇదీ చదవండి: తేజ సజ్జా నిశ్చితార్థం.. తెలంగాణ గవర్నర్‌ స్పెషల్‌ విషెస్‌)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement