బాలీవుడ్ ప్రముఖ నటుడు, 'దేవర' విలన్ సైఫ్ అలీ ఖాన్‌కి బెదిరింపులు వచ్చాయి. ఏకంగా చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్ల క్రితం మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న జీషన్ అక్తర్ పేరుతో ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీని వెనక జీషన్ ఉన్నాడా? లేదంటే అతడి పేరుతో మరెవరైనా ఇలా చేస్తున్నారా అనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బెదిరింపులపై సైఫ్ అలీఖాన్ ఇప్పటివరకు స్పందించలేదు.
(ఇదీ చదవండి: ఆ ఒక్క సీన్ కోసం నన్ను వాడుకున్నారు: స్టార్ నటి)
ఇప్పుడు కాదు గతేడాది జనవరి 16న ముంబైలోని బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లోకే తెల్లవారుజామున 2 గంటల సమయంలో చొరబడ్డ దుండగుడు.. సైఫ్‌పై పలుమార్లు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో మెడ, వీపు భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనని లీలావతి ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు దాదాపు ఆరుగంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. చికిత్స అనంతరం ఐదు రోజుల తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఇప్పుడు మరోసారి సైఫ్ అలీఖాన్‌కు హత్య బెదిరింపులు రావడంతో బాలీవుడ్‌లో భయం పట్టుకుంది. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం హీరో టైగర్ ష్రాఫ్‌పై నడిరోడ్డుపై దాడి జరిగింది. అమితాబ్‌తో పాటు ఆమిర్ ఖాన్ తదితరులకు బెదిరింపలు వస్తూనే ఉన్నాయి.
(ఇదీ చదవండి: ‘మళ్లీ కొత్త కాన్సెప్టా అనిల్ భయ్యా..’ ఈసారి రజనీకాంత్‌నే..)


