ఆ ఒక్క సీన్‌ కోసం నన్ను వాడుకున్నారు: స్టార్‌ నటి | Pujita Ponnada Comments On Her Role In Aadrsha kutumbam | Sakshi
Sakshi News home page

‘ఆదర్శ కుటుంబం రిలీజ్‌ అయ్యాక షాక్‌ అయ్యా’

Nov 19 2026 11:50 AM | Updated on Nov 19 2026 12:02 PM

Pujita Ponnada Comments On Her Role In Aadrsha kutumbam

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన రీసెంట్ మూవీ ఆదర్శ కుటుంబం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయితే రిలీజ్‌ రోజు మొదలు మొన్నటి వరకు ఆ సినిమాపై ఏదో ఒక వివాదం జరగుతూనే ఉంది. తాజాగా రంగస్థలంలో నటించిన పూజిత పొన్నాడ ఇప్పుడు ‘ఆదర్శకుటుంబం’పై ఆరోపణలు చేసింది. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

‘‘ఆదర్శకుటుంబం’లో నాకు అవకాశం వచ్చింది. నేను యుకెలో ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి సినిమా గురించి చెప్పారు. త్రివిక్రమ్ గారి సినిమా అనగానే చాలా సంతోషించా. ఆడిషన్స్ కి రమ్మన్నారు. వెంటనే హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇచ్చాను. త్రివిక్రమ్ గారు నన్ను ఎంపిక చేశారు.

ఆ సీన్ కోసం నన్ను వాడుకున్నారు
మొత్తానికి షూటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ షెడ్యూల్ లోనే నన్ను షూటింగ్ కి పిలిచారు. ఆ తర్వాత మూడు నెలల పాటు సెకండ్ షెడ్యూల్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్ కి ఫోన్ చేశాను. రెస్పాండ్ కాలేదు. మరో అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఫోన్ చేశారు. మేడం మన షూటింగ్ లేదు అని అన్నారు. మన షూటింగ్ లేదు అంటే అర్థం ఏంటి.. క్లియర్ గా చెప్పండి అని అన్నాను. 

మీ రోల్ లోకి మరో నటిని తీసుకున్నారు అని చెప్పారు. అప్పుడే షాక్‌ అయ్యా. ఒక ప్రాసెస్ ప్రకారం నన్ను ఎంపిక చేసి.. ఒక్క మాట కూడా చెప్పకుండా తొలగించారని ఫీల్‌ అయ్యా. తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే మళ్లీ మరో షాక్‌ తగిలింది. ఓ సీన్ లో నేను కనిపించా. ఆ ఒక్క సీన్ కోసం నన్ను వాడుకున్నారు’ అంటూ పూజిత ఆదర్శకుటుంబం మూవీపై ఆరోపణలు చేసింది.

(ఇదీ చదవండి: ‘లైఫ్‌ ఇచ్చినోడినే మర్చిపోయావా..?’ అనిరుధ్‌పై ఫైర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement