సంగీత దర్శకుడిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనిరుధ్ రవిచందర్ ఇటీవలే సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పోస్ట్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తనకు తొలి అవకాశం ఇచ్చిన హీరో ధనుశ్ పేరును ప్రస్తావించకపోవడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్‌కు పునాది వేసిన వ్యక్తిని ఎలా మర్చిపోతారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ నెల 11న జరిగిన అనిరుధ్-కావ్య మారన్ వివాహ వేడుకకు కూడా ధనుష్ హాజరుకాలేదని తెలుస్తోంది. ఈ వేడుకకు ఆయనకు ఆహ్వానం అందలేదనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశం కూడా తాజా వివాదానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఈ వివాదంపై అనిరుధ్ ఇప్పటి వరకు స్పందించలేదు.
తొలి అవకాశం..
15 ఏళ్ల క్రితం అనిరుధ్‌కు సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చింది ధనుష్. ఆయన హీరోగా నటించిన ‘3’ సినిమాతో అనిరుధ్ సంగీత ప్రయాణం ప్రారంభమైంది. ఈ చిత్రంలోని ‘వై దిస్ కొలవెరి డి’ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అనిరుధ్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఆ తర్వాత కూడా వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వేలై ఇల్లా పట్టధారి’ (వీఐపీ), ‘మారి’ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాల పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
(ఇదీ చదవండి: ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న : రష్మిక మందన్న)


