లైఫ్‌లో మనల్ని నమ్మే వ్యక్తి ఒక్కరున్నా చాలు  | Pavan Sadineni Talks About Aakashamlo Oka Tara Movie | Sakshi
Sakshi News home page

లైఫ్‌లో మనల్ని నమ్మే వ్యక్తి ఒక్కరున్నా చాలు 

Nov 19 2026 4:45 AM | Updated on Nov 19 2026 4:45 AM

Pavan Sadineni Talks About Aakashamlo Oka Tara Movie

– డైరెక్టర్‌ పవన్‌ సాధినేని

‘‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో పెద్ద స్టార్, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ‘ఆకాశంలో ఒక తార’. మా నిర్మాతలు సినిమాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. ‘ఆకాశంలో ఒక తార’ తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకువెళుతుంది. మన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది’’ అన్నారు పవన్‌ సాధినేని. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్‌ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్, రుహానీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్‌ మీడియా బ్యానర్లపై సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించిన ఈ మూవీ శుక్రవారం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవన్‌ సాధినేని చెప్పిన విశేషాలు.

→ కరోనా సమయంలో కల్పనా చావ్లా గారి బయోగ్రఫీ చదువుతున్నప్పుడు.. భర్తపై ఆమెకు ఉన్న ప్రేమ నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది... ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. అప్పుడే ‘ఆకాశంలో ఒక తార’ కథకు బీజం పడింది. ఈ సినిమాను మీ ఫ్యామిలీతో కలిసి చూడండి. పిల్లలను కూడా తీసుకెళ్లండి. చాలా ఇన్‌స్పైర్‌ అవుతారు. ఒక అమ్మాయి తన కలను సాధించుకోవాలనే ప్రయాణం మొదలుపెట్టినప్పుడు కృష్ణ ఎలా ప్రోత్సహించాడు? ఆమె జర్నీ ఎలా ముందుకు సాగింది? అనేది ఈ చిత్రకథ. 

→ ఈ సినిమా చూసిన తర్వాత మన జీవితంలో కూడా కృష్ణలాంటి క్యారెక్టర్‌ ఉంటే బాగుంటుందనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. లైఫ్‌లో మనల్ని నమ్మే మనిషి ఒక్కరున్నా చాలు. కృష్ణ అలాంటి నమ్మకాన్ని ఇచ్చే క్యారెక్టర్‌. నా లైఫ్‌లో నాకు ఆ నమ్మకాన్నిచ్చిన వ్యక్తి మా నాన్న. ‘నువ్వు చేయాలనుకున్నది నిజాయతీగా చెయ్‌’ అని సపోర్ట్‌ చేస్తుంటారు. 

→ నా తొలి చిత్రం ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ (2013) చూసి, అభినందించిన తొలి స్టార్‌ హీరో అల్లు అర్జున్‌గారు. ‘రేసుగుర్రం’ సెట్‌కి నన్ను పిలిపించి, నా సినిమా గురించి గొప్పగా చెప్పారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం నాకు బలాన్ని ఇచ్చింది. నేను రాసుకున్న చాలా కథలను అల్లు అర్జున్‌గారికి చెబుతుంటాను. ఆయన దగ్గర ఏదైనా కథ ఉన్నా నాకు వినిపిస్తుంటారు. పెద్ద స్టార్‌ను హ్యాండిల్‌ చేయగలననే నమ్మకం, కథ కుదిరినప్పుడు అల్లు అర్జున్‌గారితో సినిమా చేస్తాను. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement