జోడీ కుదిరింది | Satvika Veeravalli Next To Play Opposite Naga Chaitanya | Sakshi
Sakshi News home page

జోడీ కుదిరింది

Nov 19 2026 4:39 AM | Updated on Nov 19 2026 4:39 AM

Satvika Veeravalli Next To Play Opposite Naga Chaitanya

నాగచైతన్య 25వ సినిమాలో హీరోయిన్‌ ఎవరు? అనే ప్రశ్నకు ఈ చిత్రాన్ని నిర్మించనున్న అల్లు అరవింద్‌ క్లారిటీ ఇచ్చేశారు. నాగచైతన్య సరసన సాత్విక వీరవల్లిని ఎంపిక చేసినట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా... సాత్విక తొలి చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ రేపు విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందే ఆమె రెండో సినిమా గురించిన అప్‌డేట్‌ రావడం, అది కూడా స్టార్‌ హీరో నాగచైతన్య సరసన చాన్స్‌ దక్కడం, పైగా అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌ బేనర్‌ కావడం సాత్వికకు ఇది బంపర్‌ ఆఫర్‌ అనే చెప్పాలి. ‘ఆకాశంలో ఒక తార’కు ఓ నిర్మాత అయిన అల్లు అరవింద్‌ ఈ చిత్రంలో ఆమె నటన చూసి, నాగచైతన్య సినిమాకి చాన్స్‌ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement