'ప్రేమలు' అమూల్ కూతుర్ని చూశారా? | Sangeeth Prathap Daughter Name And Latest News | Sakshi
Sakshi News home page

Sangeeth Prathap: కూతురి ఫొటోలు పంచుకున్న 'ప్రేమలు' కమెడియన్

Nov 19 2026 6:36 PM | Updated on Nov 19 2026 7:01 PM

Sangeeth Prathap Daughter Name And Latest News

ప్రేమలు, బెత్లెహెం కుడుంబ యూనిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేసిన నటుడు సంగీత్ ప్రతాప్.. రెండు వారాల క్రితం తండ్రయ్యాడు. ఇతడికి పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఇప్పుడా చిన్నారికి పేరు పెట్టిన ఇతడు.. పాప ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తన కూతురికి తారా రైనే అని పేరు పెట్టినట్లు వెల్లడించాడు.

(ఇదీ చదవండి: కూతురి గురించి తప్పుడు రూమర్స్.. హీరో అర్జున్ సర్జా ఆగ్రహం)

స్వతహాగా ఎడిటర్ అయిన సంగీత్ ప్రతాప్.. 2019 నుంచి మలయాళ ఇండస్ట్రీలో ఉన్నాడు. 2022లో వచ్చిన 'హృదయం' మూవీలో చిన్న పాత్ర చేసి నటుడిగా మారాడు. తెలుగులోను డబ్బింగ్ అయిన 'ప్రేమలు' చిత్రం సంగీత్ కెరీర్ మలుపు తిప్పింది. ఇందులో అమూల్ డేవిస్ అనే పాత్రలో తెగ నవ్వించాడు. అలా నటుడిగా స్థిరపడిపోయాడు.

రీసెంట్‌గా 'బెత్లెహెం కుడుంబ యూనిట్'తో సక్సెస్ అందుకున్న సంగీత్ ప్రతాప్.. 2023 నవంబరులో ఆన్సీని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది జూలైలో ఈ జంట ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా పాపతో బిజీగా ఉన్నాడు. సంగీత్ ప్రతాప్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా చేసిన 'హలో డియర్' చిత్రం వచ్చే ఏడాది జనవరి 29న థియేటర్లలో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: పెళ్లిలో కావ్య కోసం పాట పాడిన అనిరుధ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement