ఓటీటీలోకి మలయాళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా | Sangeeth Prathap Its Medical Miracle Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Its Medical Miracle OTT: 'ప్రేమలు' నటుడి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ప్రకటన

Oct 10 2026 12:10 PM | Updated on Oct 10 2026 12:26 PM

Its Medical Miracle Movie OTT Release Date Details

ప్రేమలు, బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంగీప్ ప్రతాప్.. హీరోగానూ అడపాదడపా మూవీస్ చేస్తున్నాడు. అలా గత నెలలో ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌తో థియేటర్లలోకి వచ్చాడు. భిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కి ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: 26 ఏళ్లకే కోట్లు ఖరీదైన కారు కొన్న 'ప్రేమలు' హీరో)

సంగీత్ ప్రతాప్, షరాఫుద్దీన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రలు చేసిన మలయాళ థ్రిల్లర్ మూవీ 'ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్'. సెప్టెంబరు 15న థియేటర్లలో రిలీజైంది. పర్లేదనిపించుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని వచ్చే గురువారం(అక్టోబర్ 15) నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారు.

'ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్' విషయానికొస్తే.. బ్రెయిన్ డెడ్ అయిన ఓ కుర్రాడు (సంగీత్ ప్రతాప్) ఊహించని విధంగా తిరిగి బతుకుతాడు. కానీ కోమా నుంచి బయటకొచ్చినప్పటి నుంచి చుట్టుపక్కల జరిగే ప్రతి చిన్నశబ్దాన్ని విపరీతమైన తీవ్రతతో వినగలిగే అసాధారణ శక్తి వస్తుంది. తన ప్రాణాలని కాపాడిన నర్సు గొంతుని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో ఇతడు ఒక సీక్రెట్ గేమ్, కొందరు శత్రువులని ఎదుర్కొంటాడు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: త్రివిక్రమ్.. నా కుటుంబ బలహీనతని వాడుకున్నారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement