breaking news
Sangeeth Prathap
-
'ప్రేమలు' అమూల్ కూతుర్ని చూశారా?
ప్రేమలు, బెత్లెహెం కుడుంబ యూనిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేసిన నటుడు సంగీత్ ప్రతాప్.. రెండు వారాల క్రితం తండ్రయ్యాడు. ఇతడికి పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఇప్పుడా చిన్నారికి పేరు పెట్టిన ఇతడు.. పాప ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తన కూతురికి తారా రైనే అని పేరు పెట్టినట్లు వెల్లడించాడు.(ఇదీ చదవండి: కూతురి గురించి తప్పుడు రూమర్స్.. హీరో అర్జున్ సర్జా ఆగ్రహం)స్వతహాగా ఎడిటర్ అయిన సంగీత్ ప్రతాప్.. 2019 నుంచి మలయాళ ఇండస్ట్రీలో ఉన్నాడు. 2022లో వచ్చిన 'హృదయం' మూవీలో చిన్న పాత్ర చేసి నటుడిగా మారాడు. తెలుగులోను డబ్బింగ్ అయిన 'ప్రేమలు' చిత్రం సంగీత్ కెరీర్ మలుపు తిప్పింది. ఇందులో అమూల్ డేవిస్ అనే పాత్రలో తెగ నవ్వించాడు. అలా నటుడిగా స్థిరపడిపోయాడు.రీసెంట్గా 'బెత్లెహెం కుడుంబ యూనిట్'తో సక్సెస్ అందుకున్న సంగీత్ ప్రతాప్.. 2023 నవంబరులో ఆన్సీని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది జూలైలో ఈ జంట ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా పాపతో బిజీగా ఉన్నాడు. సంగీత్ ప్రతాప్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా చేసిన 'హలో డియర్' చిత్రం వచ్చే ఏడాది జనవరి 29న థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: పెళ్లిలో కావ్య కోసం పాట పాడిన అనిరుధ్) View this post on Instagram A post shared by Sangeeth Prathap (@sangeeth.prathap) -
ఓటీటీలోకి మలయాళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా
ప్రేమలు, బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంగీప్ ప్రతాప్.. హీరోగానూ అడపాదడపా మూవీస్ చేస్తున్నాడు. అలా గత నెలలో ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌తో థియేటర్లలోకి వచ్చాడు. భిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కి ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: 26 ఏళ్లకే కోట్లు ఖరీదైన కారు కొన్న 'ప్రేమలు' హీరో)సంగీత్ ప్రతాప్, షరాఫుద్దీన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రలు చేసిన మలయాళ థ్రిల్లర్ మూవీ 'ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్'. సెప్టెంబరు 15న థియేటర్లలో రిలీజైంది. పర్లేదనిపించుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని వచ్చే గురువారం(అక్టోబర్ 15) నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారు.'ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్' విషయానికొస్తే.. బ్రెయిన్ డెడ్ అయిన ఓ కుర్రాడు (సంగీత్ ప్రతాప్) ఊహించని విధంగా తిరిగి బతుకుతాడు. కానీ కోమా నుంచి బయటకొచ్చినప్పటి నుంచి చుట్టుపక్కల జరిగే ప్రతి చిన్నశబ్దాన్ని విపరీతమైన తీవ్రతతో వినగలిగే అసాధారణ శక్తి వస్తుంది. తన ప్రాణాలని కాపాడిన నర్సు గొంతుని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో ఇతడు ఒక సీక్రెట్ గేమ్, కొందరు శత్రువులని ఎదుర్కొంటాడు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: త్రివిక్రమ్.. నా కుటుంబ బలహీనతని వాడుకున్నారు) View this post on Instagram A post shared by ManoramaMAX (@manoramamax)


