త్రివిక్రమ్.. నా కుటుంబ బలహీనతని వాడుకున్నారు | Poonam Kaur Makes Fresh Allegations Against Trivikram Srinivas, Shares Cryptic Post On Harassment And Victims Goes Viral | Sakshi
Sakshi News home page

Poonam Kaur Trivikram: మా అసోసియేషన్.. త్రివిక్రమ్‌ని ఎందుకు ప్రశ్నించట్లేదు?

Oct 10 2026 11:32 AM | Updated on Oct 10 2026 12:22 PM

Poonam Kaur Reacts On Director Trivikram Latest

తెలుగు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, నటి పూనమ్ కౌర్ మధ్య ఏం జరిగిందో ఏమో గానీ గత కొన్నేళ్ల నుంచి త్రివిక్రమ్‌ని నేరుగానే ప్రస్తావిస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటుంది. తాజాగా అలానే మరో సంచలన పోస్ట్ పెట్టింది. తన కుటుంబ బలహీనతని సదరు దర్శకుడు ఉపయోగించుకున్నాడని రాసుకొచ్చింది. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: 26 ఏళ్లకే కోట్లు ఖరీదైన కారు కొన్న 'ప్రేమలు' హీరో)

'త్రివిక్రమ్ శ్రీనివాస్.. నా కుటుంబ బలహీనతని ఆసరాగా చేసుకుని వారితోనే ఓ ప్రకటన ఇప్పించారు. దానికి నేను కట్టుబడి లేను. రాజకీయ నాయకులు చేసిన వాటికి మేం జవాబుదారీ కాదు. సమస్య వచ్చినప్పుడు అక్కడి నుంచి పారిపోయి తిరిగి వాళ్లకు అవసరమైనప్పుడు మమ్మల్ని వాడుకోవడం ఆయన చేసిన అత్యంత దుర్మార్గమైన పని. మా (MAA) అసోసియేషన్, ఆయనని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇంకా ఎవరికోసం ఎదురుచూస్తున్నారు? మరింతమంది అమాయకుల జీవితాలు నాశనమయ్యేవరకు ఎదురుచూస్తారా?' అని పూనమ్ కౌర్ తన ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.

మరోవైపు నానా పటేకర్‌ని ఉద్దేశిస్తూ పరోక్షంగా పూనమ్ ఓ పోస్ట్ పెట్టింది. 'ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన వాళ్లు ఇతరులకు కలిగించిన బాధ వాటంతట అదే చెరిగిపోదు. వేధింపులకు పాల్పడిన వ్యక్తి మరణించినంత మాత్రాన ఆ వేధింపులు అబద్ధాలు అయిపోవు. ఆ వ్యక్తికి బహిరంగంగా నివాళులు అర్పిస్తున్నప్పటికీ, బాధితులు ఎదుర్కొన్న అనుభవాలు అబద్ధం కావు. వారి బాధ తగ్గిపోదు. ఒకరి మరణానికి సంతాపం తెలపడం ఎంత సహజమో, వారితో ముడిపడిన బాధని మోస్తున్న వ్యక్తులూ ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవడం అంతే ముఖ్యం. ఒక వ్యక్తిని పొగడటానికి మాత్రమే అనుమతిస్తూ, బాధితులని పూర్తిగా మర్చిపోతే ఎలా?' అని పూనమ్ రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: శ్రీ విష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'కి వచ్చిన వసూళ్లెంత?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement