మెగాస్టార్ చిరంజీవి టాక్ షో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ టాక్ షోకు మెగావర్స్ అనే పేరు కూడా పెట్టారు. ఈ షో వచ్చే నెలలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఎప్పటి నుంచి అనేది అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఈ షోను ఈనెల 30న అధికారికంగా లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రచారంలో భాగంగా పోస్టర్స్ నగరమంతా అంటించారు. అయితే వీటిలో చిరంజీవి పేరులో ఎన్ లెటర్ మిస్ చేశారు. ఇంతకీ ఆ లెటర్ ఎందుకు మిస్ చేశారని నెట్టింట చర్చ మొదలైంది.
(ఇది చదవండి: ఓటీటీకి సూర్య లేటేస్ట్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!)
తాజాగా నెట్‌ఫ్లిక్స్ అందరి అనుమానాలకు తెరదించింది. ఈ టాక్ షోకు సంబంధించి ఎన్ లెటర్ మిస్ కావడంపై వీడియోను రిలీజ్ చేసింది. ఆ అక్షరంతో మెగా కోలబరేషన్ కుదిరేసింది.. మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు అన్ని ఓకే చోట అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఆ N అక్షరానికి నెట్ ఫ్లిక్స్ లోగో వచ్చేలా రివీల్ చేశారు. ఇది నా అడ్డా అంటూ ఈ వీడియోలో ముగించారు. ఈ షో పూర్తి వివరాలు 30న జరిగే లాంఛ్ ఈవెంట్‌లో వెల్లడించనున్నారు.
N’ vacchesindi… MEGA collaboration kudiresindi! ❤️🔥 Mega Nostalgia. Mega Navvulu. Mega Muchatlu! 💁🏻♂️ Anni oke chota! ✨ MEGASTAR enters the Netflix universe with Chiranjeevi’s MEGAVERSE 🌟 Coming Soon, only on Netflix! #MegaverseOnNetflix https://t.co/hqMrpdf8GM
— Netflix India South (@Netflix_INSouth) November 24, 2026


