చిరంజీవి.. 'మెగావర్స్'
నటుడిగా, రాజకీయ నాయకుడిగా చిరంజీవి ఏంటనేది జనాలకు తెలుసు. మధ్యలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకి హోస్టింగ్ చేసి తనదైన శైలిలో మెప్పించాడు. ఇప్పుడు మరోసారి హోస్టింగ్ చేసేందుకు సిద్ధమైపోయారు. ఎప్పటినుంచో వినిపిస్తున్నట్లు ఓటీటీలో చిరు టాక్ షో షూటింగ్ మొదలైంది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో డిస్కషన్‌కి కారణమైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ షో చేయనున్నారని, ఇందులో తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర సంగతులు పంచుకోనున్నారని గతంలో టాక్ వినిపించింది. ఇది నిజమా కాదా అనుకొనేలోపు.. ఇది నిజమే అని క్లారిటీ వచ్చేసింది. 'మెగావర్స్' పేరుతో ఈ టాక్ షో ఉండనుంది. బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్'కి పనిచేసిన ప్రముఖ రచయిత బీవీఎస్ రవి.. చిరు టాక్ షో కోసం పనిచేయనున్నారు.హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ టాక్ షో షూటింగ్.. మంగళవారం మొదలవగా బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సత్య పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది రెగ్యులర్ టాక్ షోల స్టైల్లో ఉంటుందా? లేదంటే ఏమైనా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఇది ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనేది చూడాలి?(ఇదీ చదవండి: లిఫ్ట్ ఎక్కి గతాన్ని మార్చే అవకాశమొస్తే.. ఓటీటీలో తెలుగు థ్రిల్లర్)