పుట్టపర్తిలో రామాయణ సీత ప్రత్యేక ప్రార్థనలు.. వీడియో వైరల్ | Sai Pallavi joins bhajan session at Puttaparthi following Ramayana success | Sakshi
Sakshi News home page

Sai Pallavi: పుట్టపర్తిలో సాయిపల్లవి ప్రత్యేక ప్రార్థనలు.. వీడియో వైరల్

Nov 24 2026 9:01 AM | Updated on Nov 24 2026 9:01 AM

Sai Pallavi joins bhajan session at Puttaparthi following Ramayana success

ప్రముఖ ఆధ్యాత్మిక నగరం పుట్టపర్తిలో హీరోయిన్ సాయి పల్లవి సందడి చేశారు. శ్రీ సత్య సాయి బాబా శతజయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఆశ్రమంలో భక్తులతో కలిసి ప్రార్థన, భజనలు చేస్తూ కనిపించారు. ప్రశాంతి నిలయంలోని 'సాయి కుల్వంత్ హాల్'లో సాయిపల్లవి పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన్నా సైతం పుట్టపర్తిని సందర్శించారు. తనపై ఆయన ప్రభావం చాలా ఉందని మాట్లాడారు.

కాగా.. సాయి పల్లవి గతంలో కూడా కొత్త సంవత్సరం సందర్భంగా పుట్టపర్తిని సందర్శించారు. గతేడాది ఆశ్రమంలో జరిగిన బాబా జయంతి వేడుకలకు కూడా హాజరయ్యారు. తన పేరు 'సాయి' అని స్వయంగా శ్రీ సత్య సాయి బాబాయే పెట్టారని.. తన కుటుంబం ఎప్పటి నుంచో ఆయన భక్తులమని ఆమె వెల్లడించారు. తాను జార్జియాలో వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడు 'రేడియో సాయి' వినడం తనకు ఇంటికి దూరంగా ఉన్నామనే బాధను అధిగమించడానికి ఎంతగానో సహాయపడిందని సాయి పల్లవి గుర్తుచేసుకున్నారు.

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే ఇటీవలే ఆమె రామాయణ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంలో సీత పాత్రలో అలరించారు. నితీశ్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా.. యశ్ రావణుడిగా కనిపించారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.1700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.  ఈ చిత్రానికి సీక్వెల్ 2028లో విడుదల కానుంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement