కోలీవుడ్ హీరో విజయ్ నటించిన లేటేస్ట్ మూవీ అప్పా కుట్టి. ఈ మూవీని ఇప్పటికే కోలీవుడ్‌లో రిలీజ్ చేశారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయనుంది. నాన్న కుట్టి పేరుతో టాలీవుడ్ అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.
ఇటీవల ట్రైన్‌లో జనరల్ భోగిలో ప్రయాణించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. అందరికంటే భిన్నంగా మూవీని ప్రమోట్ చేసుకుంటూ దూసుకెళ్తన్నారు. తాజాగా హైదరాబాద్‌లోనూ విజయ్ ఆంటోనీ సందడి చేశారు. నగర వీధుల్లో హీరోయిన్ ప్రీతి అస్రానితో కలిసి అలరించారు. ఓ మిర్చి బండీ వద్ద తానే స్వయంగా బజ్జీలు వేసి అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో ఇవాళ జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేయనున్నారు.
@vijayantony garu preparing Bajjis along with @PreethiOffl #NannaKutty on Nov 27th #VijayAntony #PreethiAsrani https://t.co/pqrO80fRRH
— Sai Satish (@PROSaiSatish) November 23, 2026


