'పెద్ది'లో ఐటమ్ సాంగ్.. అలా కనిపించడాన్ని నేను ఎంజాయ్ చేస్తా | Shruthi Haasan Reacts Peddi Song And Janhvi Kapoor Issue | Sakshi
Sakshi News home page

Shruthi Haasan: జాన్వీ కపూర్ కామెంట్స్‌పై శ్రుతి రియాక్షన్

Nov 24 2026 12:23 AM | Updated on Nov 24 2026 12:23 AM

Shruthi Haasan Reacts Peddi Song And Janhvi Kapoor Issue

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా కలెక్షన్స్ రాబట్టినప్పటికీ కంటెంట్ పరంగా చాలా విమర్శలు ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా మూవీలో జాన్వీ కపూర్ సీన్స్‌పై రిలీజ్ టైంలో చాలా విమర్శలు రాగా దర్శకుడు సారీ చెప్పాడు. కొన్నాళ్ల క్రితం తనని సినిమాలో చూపించిన తీరుపై జాన్వీ కామెంట్స్ మరిన్ని విమర్శలకు కారణమయ్యాయి. అయితే 'పెద్ది'లో ఐటమ్ సాంగ్ చేసిన శ్రుతిహాసన్.. ఈ వివాదంపై మాట్లాడింది. బోల్ట్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

(ఇదీ చదవండి: ఒక్క మాటతో.. నాగచైతన్యకు భార్య స్పెషల్ విషెస్..!)

'ఆకాశంలో ఒక తార' ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి హాసన్‌ని సదరు యాంకర్.. 'పెద్ది' పాట వివాదం, జాన్వీ కపూర్ కామెంట్స్ గురించి అడిగాడు. దీనిపై స్పందించిన శ్రుతి హాసన్.. మరొకరి అనుభవం గురించి నేను మాట్లాడటం సరికాదు. ఆ గొడవలోకి నేను వెళ్లదలుచుకోలేదు. ఎందుకంటే ఆ హీరోయిన్ల పరిస్థితి ఏంటో తెలియకుండా వాళ్ల తరఫున నేను మాట్లాడలేను. అలానే నా గురించి వాళ్లు మాట్లాడలేరు.

ఇక తాను ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం గురించి మాట్లాడిన శ్రుతి హాసన్.. గతంలోనూ ఇలాంటి పాటలు నేను చేశాను. డ్యాన్స్ చేయడం, అందంగా రెడీ అవడంతో పాటు గ్లామరస్‌గా కనిపించడాన్ని నేను ఇష్టపడతాను. అయితే వేరే ఎవరినో మెప్పించడం కోసం నేను అలాంటి సాంగ్స్ చేయను. నాకు నచ్చని డ్రస్ వేసుకోను అని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: కనీసం ముఖం చూడలేదు.. అతడితో పెళ్లేంటి?: సారా టెండూల్కర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement