‘ఆలోచన’ ట్రైలర్‌ విడుదల చేసిన చిరంజీవి | alochana movie official trailer released by chiranjeevi | Sakshi
Sakshi News home page

Alochana movie Trailer: ‘ఆలోచన’ ట్రైలర్‌ విడుదల చేసిన చిరంజీవి

Nov 23 2026 9:00 PM | Updated on Nov 23 2026 9:00 PM

alochana movie official trailer released by chiranjeevi

సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘ఆలోచన’. ఈ ఈ చిత్రానికి  సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఈ మూవీని ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హీరో చిరంజీవి ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. వృద్ధాప్యంలో సాగే స్నేహం నేపథ్యంలో కథ సాగుతోంది. కాగా ఈ చిత్రాన్ని మూడు రోజుల పాటు ఉచితంగా వీక్షించేందుకు అవకాశం కల్పించారు. ‍అయితే కేవలం 60 ఏళ్లు పైబడినవారికే ఈ ఛాన్స్ దక్కనుంది. ఈ నెల 27,28,29 తేదీల్లో వయసు నిర్ధారించే గుర్తింపు పత్రం ఆధార్ కార్డ్ చూపించి ఈ మూవీని వీక్షించొచ్చు. 

(ఇదీ చదవండి: నటుడిగా 51 ఏళ్లు.. మోహన్‌బాబు వేడుకలో తారల సందడి)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement