మంచు విష్ణుతో ప్రభుదేవా.. కొత్త సినిమా ప్రకటన! | Vishnu Manchu Prabhu Deva Action Movie | Sakshi
Sakshi News home page

మంచు విష్ణుతో ప్రభుదేవా.. కొత్త సినిమా ప్రకటన!

Nov 23 2026 4:42 PM | Updated on Nov 23 2026 4:42 PM

Vishnu Manchu Prabhu Deva Action Movie

మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు ప్రభుదేవా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. విష్ణుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే.. ఆయనతో కలిసి ఓ కొత్త సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు ప్రభుదేవా సామాజిక మాధ్యమాల వేదికగా విష్ణుతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ‘నా హీరో, తమ్ముడు మంచు విష్ణుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. విఎం 24 (వర్కింగ్‌ టైటిల్‌)తో ఈ సంబరాలు మరింత ప్రత్యేకంగా మారాయి’ అని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు స్పష్టమైంది.

కాగా, వీరి కలయికలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనున్నట్లు సమాచారం. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ ప్రాజెక్ట్‌ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా కథ, ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: మైనర్‌ వేధింపుల కేసు.. సింగర్‌ చిన్మయి సంచలన వ్యాఖ్యలు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement