నటుడిగా 51 ఏళ్లు.. మోహన్‌బాబు వేడుకలో తారల సందడి | mohan babu at 51 movie celebrations | Sakshi
Sakshi News home page

మోహన్‌బాబు నట ప్రస్థానానికి 51 ఏళ్లు

Nov 23 2026 7:58 PM | Updated on Nov 23 2026 8:27 PM

mohan babu at 51 movie celebrations

ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు సినీ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. నటుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమై 51 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై మోహన్‌బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

(ఇదీ చదవండి: రాజమౌళికే ఝలక్‌.. యాపిల్‌ మ్యాప్‌లో ‘వారణాసి’ సెట్‌..!)

దర్శకులు వి.వి.వినాయక్‌, బుచ్చిబాబు సానా, శ్రీకాంత్‌ ఓదెల, వెంకీ అట్లూరితో పాటు నటులు బ్రహ్మానందం, వి.కె.నరేశ్‌, సునీల్‌, రచయిత కోన వెంకట్‌, పలువురు నిర్మాతలు, ఇతర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. అభిమానులు, సన్నిహితులు ఆయనకు అభినందనలు తెలిపారు.

కాగా ఈ ఏడాది మోహన్‌బాబు నటుడిగా తనదైన ముద్ర వేశారు. ‘ది ప్యారడైజ్‌’, ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రాల్లో ప్రతినాయక పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. కొన్ని దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. 

(ఇదీ చదవండి: శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’.. టీజర్‌ వచ్చేసింది..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement