ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా వివరాలను చిత్రబృందం ఎంతో గోప్యంగా ఉంచుతున్నప్పటికీ.. అప్పుడప్పుడు ఏదో ఒక విషయం బయటకు వస్తూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్ దృశ్యాలు యాపిల్ మ్యాప్స్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సెట్‌ను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా కొందరు నెటిజన్లు సినిమా లొకేషన్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది. యాపిల్ మ్యాప్స్‌లో కనిపించిన సెట్ దృశ్యాలను వీడియోగా రూపొందించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సినిమా విషయానికొస్తే
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం ప్యాచ్‌వర్క్ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్, సీజీఐ, రీరికార్డింగ్, వివిధ భాషల్లో డబ్బింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో మహేశ్‌బాబు ‘రుద్ర’ పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.
(ఇదీ చదవండి: అప్పుడు కాదు.. ఇప్పుడు నేనేంటో చూస్తారు: డింపుల్)
Varanasi set in Apple maps 👌 @VaranasiMovie @ssk1122 https://t.co/3lD9T9wlRO
— 𝗦𝗨𝗥𝗬𝗔 𝗕𝗛𝗔𝗜🔱 (@Bob_jr_4005) November 23, 2026


