మలయాళ భామ నివేదా థామస్.. తెలుగులోనూ చాలానే సినిమాలు చేసింది. రెండేళ్ల విరామం తర్వాత నివేదా థామస్ 'శ్రీమతి' అనే ఫ్యామిలీ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో మధ్యతరగతి గృహిణి మధుశ్రీగా కనిపించనుంది. తిరువీర్ కీలక పాత్ర పోషించారు.
విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 04 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ని విడుదల చేశారు. నాట్యం ఇంటే ఇష్టం ఉన్న అమ్మాయికి పెళ్లై, అత్తారింటికి వెళ్లాక ఎలాంటి పరిస్థితులెదురయ్యాయి అనే కాన్సెప్ట్‌తో సినిమాని రూపొందించారు.


