మొన్నే ‘కామ్రేడ్ కళ్యాణ్’తో అలరించాడు హీరో శ్రీవిష్ణు. ఇప్పుడు మరో వినోదాత్మక చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్’. సాక్షి మడోల్కర్ కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వచ్చే సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. శ్రీవిష్ణు సన్నివేశాలు, నటుడు నరేశ్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటున్నాయి. టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
(ఇదీ చదవండి: రాజమౌళికే ఝలక్.. యాపిల్ మ్యాప్‌లో ‘వారణాసి’ సెట్..!)


