శ్రీ విష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'కి వచ్చిన వసూళ్లెంత? | Comrade Kalyan Movie Day 1 Collection | Sakshi
Sakshi News home page

Comrade Kalyan Collection: తొలిరోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయ్?

Oct 10 2026 10:47 AM | Updated on Oct 10 2026 10:50 AM

Comrade Kalyan Movie Day 1 Collection

కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలతో ఆకట్టుకునే శ్రీ విష్ణు నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'కామ్రేడ్ కళ్యాణ్'. మహిమ నంబియార్ హీరోయిన్ కాగా జానకిరామ్ దర్శకుడు. ఈ వీకెండ్ వచ్చిన చిత్రాల్లో కాస్తోకూస్తో చెప్పుకోదగ్గ చిత్రమది. మరి ఈ సినిమాకు తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయంటే?

(ఇదీ చదవండి: 26 ఏళ్లకే కోట్లు ఖరీదైన కారు కొన్న 'ప్రేమలు' హీరో)

కామ్రేడ్ కళ్యాణ్ చిత్రానికి హిట్ టాక్ అయితే రాలేదు. ఉన్నంతలో పర్లేదని అని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. కానీ కామెడీ కంటెంట్ కారణంగా తొలిరోజు బాగానే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. దర్శకనిర్మాతలు అయితే మొదటిరోజు రూ.4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.

'కామ్రేడ్ కళ్యాణ్' విషయానికొస్తే 90వ ద‌శ‌కంలోని ఆంధ్రా ఒడిశా స‌రిహ‌ద్దు ప్రాంతం. ఓ మాదిరిగా చ‌దువుకున్న తాడికొండ కళ్యాణ్‌ (శ్రీవిష్ణు).. ఊరిలో ఓ థియేట‌ర్‌ని లీజుకు తీసుకుని న‌డిపిస్తుంటాడు. అప్పుడే అక్క‌డి అడ‌వుల్లో న‌క్స‌లైట్ ద‌ళాల ఏరివేత కోస‌మ‌ని ప్ర‌త్యేకంగా ఐపీఎస్ అధికారి జార్జ్‌కుట్టి (షైన్ టామ్ చాకో) వస్తాడు. మాస్టార్ (సాయిచంద్‌) దళానికీ, జార్జ్‌కుట్టీకి మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతుండ‌గానే, ఆ ఊరిలోకి ఒరియా అమ్మాయి సితార‌దేవి (మ‌హిమా నంబియార్‌) త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి వ‌స్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న త‌న త‌ల్లి స‌ర‌స్వ‌త‌మ్మ (రాధికా శ‌ర‌త్‌కుమార్‌)ని కాపాడిన సితార‌ని చూసి తొలి చూపులోనే కళ్యాణ్‌ ప్రేమ‌లో ప‌డతాడు. ఆమెతో క‌లిసి జీవితాన్ని పంచుకోవాల‌నుకుంటాడు.

సితార కోసం చేసిన కొన్ని పనుల వల్ల థియేట‌ర్‌ని న‌డిపే కళ్యాణ్‌.. కామ్రేడ్ కళ్యాణ్‌ అవుతాడు. పోలీసుల‌కు మోస్ట్ వాంటెడ్‌గా మారిపోతాడు. అడ‌విలోని అన్న‌ల‌కు, కళ్యాణ్‌కు సంబంధమేంటి?  త‌న ప్రేయ‌సి సితార కుటుంబాన్ని క‌ష్టాల నుంచి గట్టెక్కించాడా? సితార కుటుంబం క‌ష్టాల్లో కూరుకుపోవ‌డానికి కార‌ణ‌మేమిటి? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement