breaking news
Comrade Kalyan Movie
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు
మూవీ లవర్స్‌కి ఈ వీకెండ్ పండగే పండగ అని చెప్పొచ్చు. ఒకటా రెండా పదుల సంఖ్యలో కొత్త సినిమాలు, అవి కూడా తెలుగులోనే స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. బత్తా, సిగ్మా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇమ్మోర్టల్, ఎస్సై యుగంధర్, అవరచన్ & బాయ్స్ లాంటి చిత్రాలతో పాటు అక్క, రుద్రవనం పీఎస్ లాంటి సిరీస్‌లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవలా ఉండగానే మరో రెండు కొత్త సినిమాలు సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' ట్విటర్ రివ్యూ)శ్రీవిష్ణు హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'కామ్రేడ్ కళ్యాణ్'. మహిమా నంబియార్ హీరోయిన్. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ స్టోరీనే తీసుకున్నప్పటికీ దీనిని కామెడీగా తెరకెక్కించారు. ఈ నెల 02న థియేటర్లలో రిలీజై ఇప్పుడు నెల తిరిగేసరికి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చూడొచ్చు.'కామ్రేడ్ కళ్యాణ్' విషయానికొస్తే.. 90ల్లో ఆంధ్రా-ఒడిశా బోర్డర్ అది. అంతంత మాత్రమే చదువుకున్న తాడికొండ కల్యాణ్ (శ్రీవిష్ణు).. తన ఊరిలోనే ఓ థియేటర్ లీజుకు తీసుకుని నడిపిస్తుంటాడు. అప్పుడే అక్కడి అడవుల్లో నక్సలైట్ దళాల ఏరివేత కోసమని ఐపీఎస్ అధికారి జార్జ్‌కుట్టి (షైన్ టామ్ చాకో) వస్తాడు. మాస్టార్ (సాయిచంద్) దళానికీ, జార్జ్కుట్టీకి మధ్య యుద్ధం నడుస్తుండగానే.. అదే ఊరిలోని ఒరియా అమ్మాయి సితారదేవి (మహిమా నంబియార్) వస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లి సరస్వతమ్మ (రాధికా శరత్‌కుమార్)ని కాపాడిన సితారని చూసి తొలి చూపులోనే కల్యాణ్ ప్రేమలో పడతాడు కళ్యాణ్. ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా థియేటర్ని నడిపే కల్యాణ్ కాస్త కామ్రేడ్ కల్యాణ్ అవుతాడు. పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిపోతాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)లాక్ డౌన్ టైంలో ఓటీటీల్లో సంచలన రేపిన సిరీస్ అంటే చాలామంది చెప్పేపేరు 'మీర్జాపుర్'. తెలుగు డబ్బింగ్ ప్రేక్షకుల్ని చాలా అలరించింది. ఇప్పటికే మూడు సీజన్లు వచ్చాయి. అయితే ఓ కొత్త కథతో ఈ ఫ్రాంచైజీ నుంచి సినిమా వచ్చింది. గత నెల 04న థియేటర్లలో రిలీజైంది. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు దీనిని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండానే తీసుకొచ్చారు. థియేటర్లలో క్రిస్పీ రన్ టైంతో రిలీజ్ కాగా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అదనంగా సీన్స్ జోడించి రిలీజ్ చేశారు. మొత్తం మూడున్నర గంటల నిడివితో ఓటీటీలో హిందీలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ మరికొన్నిరోజుల పట్టేలా ఉంది.'మీర్జాపూర్' విషయానికొస్తే.. అఖండానంద్ త్రిపాఠి అలియాస్ ఖాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) మీర్జాపూర్‌కు అప్రకటిత రాజు. పూర్వాంచల్‌కే కాదు మొత్తం యూపీ రాజకీయాలనే శాసించే శక్తి అవుతారు. ఖాలిన్ భయ్యా చేసే ప్రతి పని, సెటిల్మెంట్ను చక్కబెడుతూ అతడికి కుడి, ఎడమ భుజంగా గుడ్డు (అలీ ఫజల్), బబ్లూ (జితేంద్ర కుమార్) ఉంటారు. ఖాలీన్ భయ్యా కొడుకు మున్నా (దివ్యేందు). తండ్రిలా మీర్జాపూర్‌ను శాసించాలని ఉన్నా, తన దుందుడుకు స్వభావం కారణంగా ఎప్పుడూ తప్పులు చేస్తూ ఉంటాడు. మీర్జాపూర్ సింహాసనంపై కన్నేసిన బబన్ యాదవ్ (రవి కిషన్) ఒక డీల్‌తో త్రిపాఠి వద్దకు వస్తాడు. అందుకు త్రిపాఠి కూడా ఒప్పుకొంటాడు. దీంతో బబన్ యాదవ్ ఓ షరతు పెడతాడు. అందుకు కూడా త్రిపాఠి అంగీకరిస్తాడు. ఇంతకీ బబన్ యాదవ్ ఎందుకు మీర్జాపూర్ సింహాసనం ఎక్కాలనుకున్నాడు? అతడి కుట్ర గురించి త్రిపాఠికి ఎలా తెలిసింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు) -
తొలి సినిమాతోనే సత్తా చాటిన దర్శకుడు జానకిరామ్
తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కొందరికి అలా జరిగిపోతూ ఉంటుంది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీతో దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఇలా తన ప్రతిభ చాటుకున్నారు. సింపుల్ వన్‌లైనర్స్, సహజమైన సంభాషణలు, సందర్భానుసారంగా వచ్చే కామెడీతో థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించారు. భారీ కామెడీ సన్నివేశాలపై ఆధారపడకుండా, సాధారణ సన్నివేశాలతోనే వినోదాన్ని పంచడంలో సక్సెస్ అయ్యారు.(ఇదీ చదవండి: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ రివ్యూ)కామెడీ మాత్రమే కాకుండా, కమర్షియల్ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా జానకిరామ్ అద్భుతంగా తెరకెక్కించారు. తన గురువు, దర్శకుడు బాబీ తరహాలోనే యాక్షన్ సన్నివేశాలను రిచ్‌గా, ఆకట్టుకునే విజువల్స్‌తో రూపొందిస్తూ తనలోని టేకింగ్ స్కిల్‌ను చాటుకున్నారు. కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచుతూనే, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపడం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం.తొలి సినిమాతోనే వినోదానికి పెద్దపీట వేస్తూ, కథను ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానంతో జానకిరామ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకులను మెప్పించేలా సన్నివేశాలను తీర్చిదిద్దడంలో తనకున్న పట్టుని ప్రూవ్ చేసుకున్నారు. కామెడీ, యాక్షన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ను అందించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.‘కామ్రేడ్ కళ్యాణ్’ విజయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న జానకిరామ్.. ఇదే టాలెంట్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన సినిమాలతో అలరించే అవకాశం ఉంది. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తదుపరి ప్రాజెక్టులపై ఇప్పుడు అంచనాలు పెరిగాయి.(ఇదీ చదవండి: జైలర్ 2 వర్సెస్ రణబాలి.. అదొక్కటే పెద్ద మైనస్..!) -
భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పించొద్దు: ఆర్. నారాయణమూర్తి
‘‘కోన వెంకట్‌గారు నిర్మాత కాకుంటే ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా సెన్సాన్ ఇబ్బందుల్లో పడి ఉండేది, రిలీజ్ అయ్యుండేది కాదు. చాలా దుర్మార్గం ఇది. ‘బస్తర్’, ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలను ఎందుకు సెన్సార్ చేశారు? ఎందుకు రిలీజ్ చేశారు? ‘కామ్రేడ్ కళ్యాణ్’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసిన మూవీ కాదు. పోలీసులకూ వ్యతిరేకం కాదు. కేవలం బ్యాక్‌డ్రాప్ మాత్రమే నక్సల్ బరీ మూమెంట్. నక్సలైట్లు ఏం పాపం చేశారు? వాళ్లు కూడా ఈ మట్టిలో పుట్టిన బిడ్డలే. వారు కూడా భారతీయ పౌరులే. ఈ సినిమా తీసిన దర్శక–నిర్మాతలు కానీ, మేము కానీ నక్సలైట్లు కాదు.. మేము సినిమా తల్లి బిడ్డలం’’ అని ప్రముఖ నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి తెలిపారు. శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలయింది. శుక్రవారం నిర్వహించిన ‘దసరా ఫన్ డగ బ్లాక్ బస్టర్ మీట్’ కి ఆర్. నారాయణ మూర్తి, డైరెక్టర్స్ హరీష్ శంకర్, వీఎన్ ఆదిత్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ–‘‘సెన్సార్ ఇబ్బందులు పెడితే సాధారణ నిర్మాత ఏం అయి పోవాలి? కోట్లతో పని. భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పించొద్దు’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాను శ్రీవిష్ణు బాగా ప్రమోట్ చేశారు’’ అన్నారు కోన వెంకట్. ‘‘మా సినిమాకి ప్రేక్షకులు రూ. 30 కోట్ల రివార్డు ఇచ్చారు’’ అన్నారు వెంకట కృష్ణ కర్నాటి. ‘‘కామ్రేడ్ కళ్యాణ్’ నాకు గుర్తుండి పోతుంది’’ అని జానకిరామ్ మారెళ్ల తెలిపారు. రైటర్స్ బీవీఎస్ రవి, నందు, భాను, పాటల రచయిత భాస్కరభట్ల మాట్లాడారు. -
కామ్రేడ్ కల్యాణ్ షూటింగ్లో ప్రమాదం.. వీడియో వైరల్
శ్రీ విష్ణు హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్. ఈ చిత్రంలో మహిమ నంబియార్ హీరోయిన్ నటించింది. ఈ సినిమాకు జానకీరామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మొదటి రోజు పాజిటివ్ టాక్ రాకపోయినప్పటికీ.. వసూళ్లపరంగా రాణించింది. రెండు రోజుల్లోనే దాదాపు రూ.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను రచయిత కోన వెంకట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అడవిలో షూటింగ్ సందర్భంగా నటుడు శ్రీకాంత్ కింద పడబోయాడు. వెంటనే అక్కడున్న వారంతా శ్రీకాంత్‌ను పట్టుకుని ప్రమాదం నుంచి కాపాడారు. సినిమా రిలీజ్ అయ్యాక నటులు పడే బాధలు ఇలా ఉంటాయని కోన వెంకట్ ట్వీట్ చేశారు.కోన వెంకట్ తన ట్వీట్లో రాస్తూ..'ప్రాణాలు పణంగా పెట్టి మా యాక్టర్స్ చేస్తారు. సినిమాయే ప్రాణంగా మేమంతా బతుకుతాం.. ఆ సినిమా చూసి మీరు ఎంజాయ్ చేసి బ్లాక్‌బస్టర్ చేస్తే అదో పునర్జన్మ లా అనిపిస్తుంది.. కామ్రేడ్ కళ్యాణ్ కోసం ఈ సీన్ 2025 ఫిబ్రవరి లో మంగళూరు అడవిలో తీసినప్పుడు ఈ సంఘటన జరిగింది.. ఈ విజయం తో మా శ్రీకాంత్‌కు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చారు' అని పోస్ట్ చేశారు. ప్రాణాలు పణం గా పెట్టి మా యాక్టర్స్ చేస్తారు.. సినిమాయే ప్రాణంగా మేమంతా బతుకుతాం.. ఆ సినిమా చూసి మీరు ఎంజాయ్ చేసి బ్లాక్‌బస్టర్ చేస్తే అదో పునర్జన్మ లా అనిపిస్తుంది.. “కామ్రేడ్ కళ్యాణ్” కోసం ఈ సీన్ 2025 ఫిబ్రవరి లో మంగళూరు అడవిలో తీసినప్పుడు ఈ సంఘటన జరిగింది.. ఈ విజయం తో మా శ్రీకాంత్ కు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చారు 🤗 @sreevishnuoffl @siyengarks Love you Audience ❤️ #ComedyKalyanBB— KONA VENKAT (@konavenkat99) October 11, 2026 -
‘ఆ డైరెక్టర్లు క్రిమినల్స్‌తో సమానం.. వారిని బ్యాన్ చేయాలి’
తాజాగా శ్రీవిష్ణు హీరోగా, కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.‘దాదాపు 3 గంటల 50 నిమిషాలతో సినిమా తీసి, ఆ తర్వాత ఎడిటింగ్ లో ఏకంగా 1 గంట 50 నిమిషాల ఫుటేజీని కట్ చేసేస్తే ఏం ఉపయోగం?. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి తీయడం ఎందుకు, మళ్లీ దాన్ని కట్ చేయడం ఎందుకు?" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆ తొలగించిన గంటన్నర ఫుటేజీ తీయడానికి రూ.కోట్లు ఖర్చవుతాయి. ఆ వృథా అయ్యే రూ.కోట్లు ఎవరివి?, అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన నిర్మాతవి కాదా?.. ఆ డబ్బంతా నిర్మాత కుటుంబానికి చెందినవి కాదా?, హిట్ ప్లాప్‌లతో డైరెక్టర్‌కి సంబంధం లేదు. అయితే దాన్ని ప్లాన్ చేయాల్సి పని డైరెక్టర్‌దే. అలాంటి వాళ్లని ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలి’ అని మండిపడ్డారు. (ఇదీ చదవండి: రాజమౌళికి సిగ్గు ఎక్కువ.. మా ప్రేమ అలా మొదలైంది: రమా రాజమౌళి )Ban these directors from Industry. --- Kona Venkat https://t.co/dgogyaFt5R— The Cine Gossips (@TheCineGossips) October 10, 2026 -
కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రివ్యూ... హిట్టా? ఫట్టా?
-
శ్రీ విష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'కి వచ్చిన వసూళ్లెంత?
కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ఆకట్టుకునే శ్రీ విష్ణు నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'కామ్రేడ్ కళ్యాణ్'. మహిమ నంబియార్ హీరోయిన్ కాగా జానకిరామ్ దర్శకుడు. ఈ వీకెండ్ వచ్చిన చిత్రాల్లో కాస్తోకూస్తో చెప్పుకోదగ్గ చిత్రమది. మరి ఈ సినిమాకు తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయంటే?(ఇదీ చదవండి: 26 ఏళ్లకే కోట్లు ఖరీదైన కారు కొన్న 'ప్రేమలు' హీరో)కామ్రేడ్ కళ్యాణ్ చిత్రానికి హిట్ టాక్ అయితే రాలేదు. ఉన్నంతలో పర్లేదని అని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. కానీ కామెడీ కంటెంట్ కారణంగా తొలిరోజు బాగానే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. దర్శకనిర్మాతలు అయితే మొదటిరోజు రూ.4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.'కామ్రేడ్ కళ్యాణ్' విషయానికొస్తే 90వ దశకంలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతం. ఓ మాదిరిగా చదువుకున్న తాడికొండ కళ్యాణ్ (శ్రీవిష్ణు).. ఊరిలో ఓ థియేటర్ని లీజుకు తీసుకుని నడిపిస్తుంటాడు. అప్పుడే అక్కడి అడవుల్లో నక్సలైట్ దళాల ఏరివేత కోసమని ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారి జార్జ్‌కుట్టి (షైన్ టామ్ చాకో) వస్తాడు. మాస్టార్ (సాయిచంద్) దళానికీ, జార్జ్కుట్టీకి మధ్య యుద్ధం కొనసాగుతుండగానే, ఆ ఊరిలోకి ఒరియా అమ్మాయి సితారదేవి (మహిమా నంబియార్) తన తల్లిదండ్రులతో కలిసి వస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లి సరస్వతమ్మ (రాధికా శరత్‌కుమార్)ని కాపాడిన సితారని చూసి తొలి చూపులోనే కళ్యాణ్ ప్రేమలో పడతాడు. ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటాడు.సితార కోసం చేసిన కొన్ని పనుల వల్ల థియేటర్ని నడిపే కళ్యాణ్.. కామ్రేడ్ కళ్యాణ్ అవుతాడు. పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిపోతాడు. అడవిలోని అన్నలకు, కళ్యాణ్‌కు సంబంధమేంటి? తన ప్రేయసి సితార కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించాడా? సితార కుటుంబం కష్టాల్లో కూరుకుపోవడానికి కారణమేమిటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ రివ్యూ) -
పక్కా దసరా పండగ సినిమా ఇది: హీరో శ్రీ విష్ణు
శ్రీవిష్ణు, మహిమా నంబియార్ హీరో హీరోయిన్లుగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో రూ పొందిన సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించిన ఈ సినిమా నిన్న (శుక్రవారం) విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు నేను కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్లో చాలా సినిమాలు చేశాను.దీంతో మాస్ కామెడీ సినిమా అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకునేవాడిని. కానీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది’’ అని అన్నారు.‘‘కామ్రేడ్ కళ్యాణ్’ను హిలేరియస్ ఎంటర్టైన్మెంట్గా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు’’ అని కోన వెంకట్ తెలిపారు. ‘‘సినిమా చాలా బాగుందని మంచి టాక్ వస్తోంది. ఈ దసరాకు శ్రీ విష్ణు, కోనగార్ల నుంచి ప్రేక్షకులకు అందిన ఒక పెద్ద గిఫ్ట్ ఈ సినిమా’’ అని తెలిపారు వెంకట కృష్ణ కర్నాటి. ‘‘ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు జానకిరామ్. -
కామ్రేడ్ కళ్యాణ్ సక్సెస్ మీట్( ఫొటోలు)
-
‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
కోన వెంకట్ సమర్పణలో వెంటక కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. భాను, నందు రచయితలుగా జానకిరామ్ మారెళ్ల తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీవిష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, షైన్ టాం చాకో, ఉపేంద్ర లిమాయే ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చారు. మరి ఈ సినిమా కథ ఏంటి? ఎలా ఉంది? అన్నది ఓ సారి చూద్దాం.కథ ఏంటంటే?1994 నేపథ్యంలో సాగే ఈ కథ మాడుగుల అనే ప్రాంతంలో జరుగుతుంది. ఆ ఊర్లోని థియేటర్లో ఆపరేటర్‌గా పని చేస్తుంటాడు కళ్యాణ్ (శ్రీ విష్ణు). కళ్యాణ్ తల్లి సరస్వతమ్మ బాలయ్య అభిమాని. ఎప్పుడూ ఏదో ఒక ఫ్యాన్ వార్ పెట్టుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంటుంది. ఆమెని విడిపించేందుకు కళ్యాణ్ నానా తంటాలు పడుతుంటాడు. ఎప్పటికైనా థియేటర్‌కి యజమాని అవ్వాలని కళ్యాణ్ అనుకుంటాడు. అతని జీవితంలోకి సితార (మహిమా నంబియార్) ఒరియా అమ్మాయిగా వస్తుంది. భాష అడ్డంకిగా ఉందని తన ప్రేమను తెలిపేందుకు కళ్యాణ్ అష్టకష్టాలు పడుతుంటాడు. అయితే అలాంటి సమయంలోనే సితార తెలుగమ్మాయి అని తెలుస్తుంది. సితారకు బిష్వాస్ (ఉపేంద్ర లిమాయే) నుంచి ఆపద గురించి తెలుస్తుంది. ఆ ఆపద నుంచి సితారను బయట పడేసేందుకు కళ్యాణ్ కాస్త కామ్రేడ్ కళ్యాణ్ అవుతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? కళ్యాణ్ చివరకు తన ప్రేయసిని తిరిగి చేరుకున్నాడా? అసలు ఈ కథలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ జార్జ్ కుట్టి (షైన్ టాం చాకో), శంకరన్న (శత్రు), మాస్టర్ (సాయి చంద్), సత్తి బాబు (సత్య), పళ్లం రాజు (ప్రభాస్ శీను), ఎస్సై అప్పలనాయుడు (బ్రహ్మాజీ) పాత్రలు ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే?ఓ సీరియస్ సబ్జెక్ట్‌ని ఎంత సిల్లీగా, కామెడీగా చెప్పాలో.. అంత సిల్లీగా, కామెడీగా చెప్పారు. తీసుకున్నది 90వ దశకం అయినా మాటలు, చేష్టలు అన్నీ కూడా ఈ జెన్ జీ బ్యాచ్‌కి తగ్గట్టుగా అనిపిస్తాయి. 90స్ బ్యాక్ డ్రాప్ అని చెప్పడం తప్పా.. మాటలు, కదలికలు, ఆ వాతావరణం ఎక్కడా కూడా కనిపించదు. చాలా వరకు డైలాగ్స్‌లో ద్వంద్వార్థాలు కనిపిస్తుంటాయి. పేరుకే 90వ దశకం కానీ.. ఈ కథ ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. నక్సలిజం, పోలీస్ వ్యవస్థ మధ్య ఎప్పుడూ ఓ సన్నని గీత ఉంటుంది. సినిమాల్లో ఎవరిది ఒప్పు? ఎవరిది తప్పు అని చెప్పలేం. చాలా సినిమాల్లో అన్నల్ని హీరోలుగా చూపించారు.. ఎన్నో సినిమాల్లో పోలీసుల్ని హీరోలుగా చూపించారు.అయితే ఈ కామ్రేడ్ కళ్యాణ్ సినిమాని మాత్రం పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఆ కామెడీ ట్రాక్‌లో ఎమోషన్ నలిగిపోయినట్టు అనిపిస్తుంది. చివరకు మనం అన్నల సైడ్ గానీ, పోలీసుల సైడ్ గానీ ఆలోచించం. అసలు ఇందులో అలా ఆలోచించడానికి అంత ఆస్కారం కూడా ఇవ్వలేదు. మొత్తం శ్రీ విష్ణు, సత్య కామెడీతోనే లాగించేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా శ్రీ విష్ణు, సత్య, సుదర్శన్ డామినేషన్ కనిపిస్తుంది. సెకండాఫ్ అయినా ఎమోషనల్‌గా, కాస్త హార్ట్ టచింగ్‌గా ఉంటుందని అనుకుంటే.. అక్కడా మళ్లీ అదే సిల్లీ, లాజిక్ లెస్ కామెడీనే పెట్టారు. ఇక క్లైమాక్స్‌కి అటు వాళ్లు, ఇటు వీళ్లు అందరూ మంచివారు అయిపోతారు. హీరో ఇచ్చే స్పీచ్‌తో అందరూ మారిపోవడం మన తెలుగు సినిమాల్లో కామన్ అన్న సంగతి తెలిసిందే.ఎవరెలా చేశారంటే..?ఆర్టిస్టుల విషయానికి వస్తే శ్రీ విష్ణు ఎప్పటిలానే తనకు అలవాటైన పాత్రలో కనిపించి మెప్పిస్తాడు. తన వెరైటీ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్ని నవ్వించేస్తాడు. సత్య కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సుదర్శన్, ఉపేంద్ర, బలగం మురళీధర్ గౌడ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇలా అన్ని పాత్రలు నవ్విస్తాయి. హీరోయిన్గా మహిమా నంబియార్‌కి పెద్దగా ప్రాధాన్యం దక్కనట్టు అనిపిస్తుంది. షైన్ టాం చాకో పాత్ర కూడా కొత్తగా కనిపించదు. బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, రఘు బాబు ఇలా అందరూ తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు.టెక్నికల్‌గా చూసుకుంటే విజువల్స్ బాగుంటాయి. కానీ 90స్ బ్యాక్ డ్రాప్ సినిమా అన్నట్టుగా మాత్రం కనిపించదు. తెరపై పాటలు బాగానే అనిపిస్తాయి. మాటలు మాత్రం 90వ దశకంలా కాకుండా.. ఇప్పటి జబర్దస్త్ ట్రెండ్, పంచ్ డైలాగ్స్‌లా అనిపిస్తాయి. ఆర్ట్, క్యాస్టూమ్, ఎడిటింగ్ ఇలా అన్నీ పర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)
-
రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ షూటింగ్ షురూ!
-
మా కామ్రేడ్ నవ్విస్తాడు
‘‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా ఒరిస్సా–ఆంధ్ర బోర్డర్లో జరిగే కథ. మంచి ఎంటర్టైనర్. మా కామ్రేడ్ అందర్నీ నవ్విస్తాడు. శ్రీ విష్ణుగారి బలం ఎంటర్టైన్మెంట్. అది ఈ మూవీలో స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక సమస్యలో ఉన్న వ్యక్తి అటువైపు వెళ్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది వినోదాత్మకంగా ఉంటుంది. ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని డైరెక్టర్ జానకిరామ్ మారెళ్ల తెలిపారు. శ్రీ విష్ణు హీరోగా, మహిమా నంబియార్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జానకిరామ్ మారెళ్ల విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కామ్రేడ్ కళ్యాణ్’ టైటిల్ కథ నుంచే వచ్చింది. ఈ టైటిల్‌పై సెన్సార్ బోర్డ్ నుంచి తొలుత అభ్యంతరం ఎదురైంది. అయితే సినిమా చూశాక టైటిల్ ఎందుకు పెట్టామన్నది వారికి అర్థం అయింది. శ్రీ విష్ణుగారు చాలా సపోర్ట్ చేశారు. ఆయన అమ్మ పాత్రలో రాధికగారి నటన చాలా కీలకం. సత్య, షైన్ టామ్ చాకో పాత్రలూ బాగుంటాయి. కోన వెంకట్‌గారి సపోర్ట్ కూడా మరచిపోలేను’’ అని పేర్కొన్నారు. -
పక్కింటి అమ్మాయి
‘‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాలో సితార దేవిగా పక్కింటి అమ్మాయిలాంటి పాత్ర చేశాను. అమాయకత్వం, వినోదాత్మకంగా ఉంటుంది. ఒరిస్సా నుంచి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తాను. ఆ భాష కారణంగా హీరో, హీరోయిన్ మధ్య వచ్చే వినోదం చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒరిస్సాలో షూటింగ్ చేయడం సరికొత్త అనుభూతినిచ్చింది’’ అని మహిమా నంబియార్ తెలిపారు. శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన వెంకట్ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీపై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ మహిమా నంబియార్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నేను నటించిన మలయాళ, తమిళ సినిమాలు చూసిన జానకిరామ్‌గారు నాకు కాల్ చేసి ‘కామ్రేడ్ కళ్యాణ్’ కథ చెప్పారు. శ్రీవిష్ణుతో నేను ‘సామజవరగమన’ సినిమా చేయాల్సింది. కానీ, కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాలో ఆయనతో నటించడం సంతోషంగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. ప్రస్తుతం మలయాళ, తమిళ్లో సినిమాలు చేస్తున్నాను. తెలుగులో కథలు వింటున్నాను’’ అని చెప్పారు. -
‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)
-
శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ టైటిల్ సాంగ్ విన్నారా..?
శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్. ఈ సినిమాకు జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈమూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ అండ్ కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి పలు పాటలను విడుదల చేశారు. తాజాగా టైటిల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. కాగా ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. మాస్ సాంగ్ రిలీజ్
శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్. ఈ సినిమాకు జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ అండ్ కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలను విడుదల చేశారు.తాజాగా ఈ చిత్రంలోని మూడో సింగిల్ లిరికల్ పాటను రిలీజ్ చేశారు. 'ఎత్తర ఎత్తు.. పిడికిలి ఎత్తు' అంటూ సాగే సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు. ఈ సాంగ్‌ను విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు.


