శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్. ఈ సినిమాకు జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ అండ్ కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలను విడుదల చేశారు.
తాజాగా ఈ చిత్రంలోని మూడో సింగిల్ లిరికల్ పాటను రిలీజ్ చేశారు. 'ఎత్తర ఎత్తు.. పిడికిలి ఎత్తు' అంటూ సాగే సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు. ఈ సాంగ్‌ను విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు.


