శ్రీకాంత్ తనయుడి లేటేస్ట్ మూవీ.. టైటిల్ సాంగ్‌ వచ్చేసింది | Roshan Meka latest Movie Emo Emo Idi Movie title song out now | Sakshi
Sakshi News home page

Emo Emo Idi Movie: శ్రీకాంత్ తనయుడి లేటేస్ట్ మూవీ.. టైటిల్ సాంగ్‌ రిలీజ్

Sep 29 2026 3:48 PM | Updated on Sep 29 2026 4:46 PM

Roshan Meka latest Movie Emo Emo Idi Movie title song out now

శ్రీకాంత్ తనయుడు రోషన్‌ మేకా నటిస్తోన్న తాజా చిత్రం ఏమో ఏమో ఇది. ఈ మూవీలో ప్రీతి ముకుందన్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ అండ్ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.

(ఇది చదవండి: మనవరాలికి గ్రాండ్‌ వెల్‌కమ్‌.. టాలీవుడ్ విలన్ వీడియో చూశారా?)

యూత్‌ నేపథ్యంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నేటి యువతరాన్ని ఆకట్టుకొనే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఏమో ఏమో ఇది అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ కంపోజ్ చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్‌ లిరిక్స్ అందించగా.. కార్తిక్, రమ్య బెహ్రా ఆలపించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ రొమాంటిక్ సాంగ్ మీరు కూడా వినేయండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement