టాలీవుడ్ నటుడు, విలన్ టార్జాన్ అలియాస్ ఎదిరె లక్ష్మినారాయణ గప్తా గురించి పరిచయం అక్కర్లేదు. రామ్ గోపాల్ వర్మ ‘గాయం’ మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తెలుగులో కొన్ని వందల సినిమాల్లో నటించాడు. ఈ క్రమంతో తన భార్య మరణంతో నటనకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.
తాజాగా ఆయన తన మనవరాలికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇంటిని అందంగా అలంకరించిన ముద్దుల మనవరాలికి స్వాగతం పలికారు. మా ఇంటి మహాలక్ష్మికి ఘనస్వాగతం.. అంటూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


