అవకాశాల వేటలో రకుల్ ప్రీత్ సింగ్ | Rakul Preet Singh Searching For Movie Chances | Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: ఆ రెండు సినిమాలే ఈమె ఫేట్ మార్చాలి!

Sep 29 2026 7:08 AM | Updated on Sep 29 2026 9:29 AM

Rakul Preet Singh Searching For Movie Chances

మోడలింగ్‌ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన భామల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. కన్నడ సినిమాతో మొదలుపెట్టి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా 2009 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉంది. 2024లో నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాది వరకు చివరగా కమలహాసన్‌ 'ఇండియన్‌ 3'లో చేసింది. ఆ చిత్రం ఇంకా తెరపైకి రాలేదు. ప్రస్తుతం 'రామాయణ'లో శూర్పణఖ పాత్ర చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

రామాయణ, ఇండియన్ 3 తప్పితే ఈమె చేతిలో వేరే ఏ సినిమాలు లేవు. దీంతో ప్రస్తుతం అవకాశాల వేటలో పడినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే తరచూ ఫొటోషూట్స్ చేస్తూ వాటిని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ దర్శకుల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఈమె భర్త, మామకు సంబంధించిన ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇలా రకుల్ వార్తల్లో నిలిచింది.

(ఇదీ చదవండి: జ్యోతికతో పెళ్లి.. హీరో సూర్య నాలుగేళ్లు ఎదురుచూశాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement