బిగ్‌బాస్ 10లో సెలబ్రిటీల్లో ఒకరిద్దరో హైలైట్ అవుతున్నారు కానీ కామనర్స్ మాత్రం కెమెరాలకు కనిపించేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. గొడవపడుతూ, అరిచి గోల చేస్తూ రచ్చ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అపూర్వ.. వచ్చిన మూడు నాలుగు రోజులకే ఎంత హడావుడి చేయాలో అంతా చేస్తోంది. ఈమెకు తగ్గట్లే షాలిని కూడా రెచ్చిపోతోంది. ఇంతకీ బిగ్‌బాస్ హౌస్‌లో 22వ రోజైన సోమవారం(సెప్టెంబరు 29) ఎపిసోడ్‌లో అసలేం జరిగింది?
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: వర్షిణి కోసం ముకేశ్ త్యాగం.. ఎలిమినేషన్‌లో ట్విస్టులు)
వీకెండ్ ఎపిసోడ్ తర్వాత అపూర్వ కెప్టెన్ అయింది. ఇక సోమవారం ఎపిసోడ్.. కెప్టెన్ అపూర్వ, ముఖేష్ గొడవతో మొదలైంది. గిన్నెలు కడిగే, కెప్టెన్ గది ఖాళీ చేసే విషయమై ఇద్దరూ వాదించుకున్నారు. మీటింగ్ పెట్టి, రూల్స్ పెడితే.. అప్పుడు ఫాలో అవుతానని ముఖేష్ అంటే వెంటనే అపూర్వ మీటింగ్ పెట్టింది. అక్కడ కూడా ముఖేష్, అపూర్వ గొడవపడ్డారు. ఎందుకు ఇలా చులకనగా చూస్తున్నావ్, అగౌరవపర్చుతున్నావ్, కెప్టెన్ అంటే గౌరవం లేదా? నువ్వే అన్నావ్ కదా కెప్టెన్‌కి గౌరవం ఇవ్వాలని మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు అని అపూర్వ లాజిక్ తీసింది. మధ్యలోకి ఎంటరైన త్రిగుణ్.. నేను కెప్టెన్ అని పిలవను, ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నాడు.

గతవారం టెన్షన్-టెంప్టేషన్ అని అల్లాడించిన బిగ్‌బాస్.. ఈసారి టోటల్ డామినేషన్ అని కొత్త ఆట మొదలుపెట్టాడు. షాలిని, శృష్టి, చరణ్, నరేష్, త్రిగుణ్, ముఖేష్, దేబ్జానీ ఒక జట్టు(సప్తశక్తి) అని.. మిగిలిన వాళ్లంతా మరో టీమ్(భైరవ) అని చెప్పాడు. మొదటి యుద్దంలో గెలిస్తే అదిరిపోయే ఆఫర్ ఉంటుందని బిగ్ బాస్ అన్నాడు. మొదటి ఆయుధం పంపిస్తున్నా అని ఒకరి వద్ద రెండు, అంతకంటే ఎక్కువ డ్యాగర్స్‌ని సంపాదించుకోవాలని చెప్పాడు. ఎక్కువ డ్యాగర్స్ ఉన్నోళ్లు ఎదుటి వారి ఆటని మార్చొచ్చని అన్నాడు. ఇందులో భాగంగా ప్రాంక్ అని చెప్పి నరేశ్ కత్తిని రాంప్రసాద్ లాక్కున్నాడు. మరోవైపు మూడు దశల్లో రథ నిర్మాణం చేయాలని ఓ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్.. మధ్యలో బ్రిక్స్(ఇటుకల్ని) కలెక్ట్ చేయాల్సి ఉంటుందని, ఎక్కువ కలెక్ట్ చేసిన వాళ్లకే రథానికి సంబంధించిన భాగాలు దొరుకుతాయని చెప్పాడు.
ఈ టాస్క్‌కి రోహిత్, షాలిని సంచాలక్స్‌గా ఉంటూనే ఆడుకోవచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. రూల్స్ గురించి వీళ్లిద్దరూ మాట్లాడుకుంటే మధ్యలో అపూర్వ వచ్చింది. ప్రతిసారి ఇలానే మధ్యలోకి దూరుతున్నావ్ అని షాలిని అరిచేసింది. దీంతో షాలిని, అపూర్వకు గొడవ జరిగింది. మరోవైపు ఆట ప్రారంభమైన తర్వాత శృష్టి కాలికి గాయమయ్యేసరికి ఆటను ఆపేశారు. మెడికల్ రూంలోకి వెళ్లే ముందు తన కత్తిని శృష్టి.. షాలినికి ఇచ్చింది. దీని తర్వాత అపూర్వ తన టీమ్ అంతటినీ పిలిచి షాలిని దగ్గర కత్తి ఉందని, తీసుకుందామని చెప్పింది. దీంతో రోహిత్, సుధీర్, ఝాన్సీ, అమన్ ఇలా అందరూ షాలిని మీద పడ్డారు. షాలినికి చెందిన బ్లూ టీం.. రెడ్ టీంని అడ్డుకుంది. ఇందులో భాగంగా త్రిగుణ్, రోహిత్ దారుణంగా ప్రవర్తించి మాటలు జారారు.
మరోవైపు అపూర్వ, రోహిత్‌ల మీద షాలిని ఫైర్ అయింది. దీంతో అది శృష్టి కత్తి అని తెలీదు. తెలిస్తే ఇలా చేసే వాళ్లం కాదని అన్నారు. నరేష్ విషయంలోనూ మీరు ఇలానే చేశారు. ప్రాంక్ అన్నారు. ఇంత వరకు కత్తి ఇవ్వలేదు అని త్రిగుణ్ అన్నాడు. మళ్లీ ఆట ఆరంభించగానే ముఖేష్ కాలికి గాయమైంది. అమన్ ఫౌల్ గేమ్ ఆడాడని షాలిని అనేసరికి వీళ్లిద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. చివరకు రెడ్ టీం అంటే టీం భైరవ గెలిచింది. రథానికి మొదటి పార్ట్ అమర్చింది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!)


