బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి! | Bigg Boss Telugu 10, Mithilesh Reveals About His ₹15 Lakh Exit In Latest Interview, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Mithilesh: పాపం బిగ్‌బాస్.. ఒక్కడూ తప్పని అనట్లేదు

Sep 28 2026 12:30 PM | Updated on Sep 28 2026 1:13 PM

Bigg Boss Telugu 10 Mithilesh About His Exit And Latest Interview

తెలుగు బిగ్‌బాస్ షో ఇప్పటివరకు 9 సీజన్లు నడిచింది. దీని వల్ల బాగుపడినవాళ్లు మహా అయితే ఒకరో ఇద్దరు ఉంటారంతే! అంతకుమించి లేరు. ప్రైజ్‌మనీ, డబ్బుల గురించి ఎప్పుడో సీజన్ చివరాఖరుకు వచ్చేసరికి మాట్లాడుకుంటారు తప్పితే మిగతా టైంలో అసలు దీని గురించి డిస్కషనే ఉండదు. కానీ మిథిలేష్ అనే కుర్రాడి కారణంగా మొత్తం సీనే మారిపోయింది. షో పరువంతా పోయింది! ఇంతకీ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

ఇప్పటివరకు చాలామంది బిగ్‌బాస్‌కి వచ్చారు. కొందరు తమకున్న ఇమేజ్ చెడగొట్టుకోగా.. మరికొందరు మంచి గుర్తింపు తెచ్చుకుని బయటకొచ్చారు. కానీ ఎవరిని అడిగినా కప్పు కొట్టడమే ముఖ్యం. డబ్బులది ఏముంది ఎలా అయినా సంపాదించుకోవచ్చు, పేరు ముఖ్యం లాంటి కబుర్లు చెబుతారు. కానీ వీళ్లలో చాలామందికి తెలుసు నిజంగా వాళ్లు కప్పు కొట్టగలరో లేదో?

అంతెందుకు సీజన్ చివరిరోజున కప్ కావాలా? డబ్బులు కావాలా? అని హోస్ట్ నాగార్జున అడిగితే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు తీసుకుని వెళ్లిపోవడం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే వాళ్లకు కూడా తెలుసు. తమకు కచ్చితంగా కప్ రాదని, అందుకు ఎంచక్కా సూట్ కేసు తీసుకుని లక్షాధికారులు అయిపోతుంటారు. కానీ ఈ సీజన్‌లో మిథిలేష్ అనే కామనర్.. కప్ కంటే తనకు డబ్బులే ముఖ్యం అని హౌస్‌లోకి వచ్చిన రెండో రోజే హోస్ట్ నాగార్జునకే ఓపెన్‌గా చెప్పి బయటకొచ్చేశాడు. ఒకటి రెండు కాదు ఏకంగా రూ.15 లక్షలు పట్టుకుపోయాడు. ఈ ట్విస్ట్ నాగార్జున కూడా ఊహించి ఉండడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: వర్షిణి కోసం ముకేశ్ త్యాగం.. ఎలిమినేషన్‌లో ట్విస్టులు)

ఈ షోకి వచ్చేవాళ్లలో దాదాపు అందరూ చివరిరోజున వచ్చే డబ్బుల కోసమే వస్తారు అనేది పచ్చినిజం. కానీ ఎవరూ పైకి చెప్పరు. ఇదో బహిరంగా రహస్యం. అయితే డబ్బుల సూట్ కేసు తీసుకుని స్వయంగా బయటకొచ్చిన విషయంలో గతంలో సొహైల్, ఇప్పుడు ఈ మిథిలేష్ జనానికి బాగా గుర్తుండిపోతారు. హౌస్‌లో మరో మూడు నాలుగు వారాలున్నా సరే మిథిలేష్‌కి ఇంత గుర్తింపు వచ్చి ఉండేది కాదేమో! కేవలం రెండే రోజులు ఉండి.. ఎంచక్కా రూ.15 లక్షలు పట్టుకుపోయాడు. అంతెందుకు ఈ సీజన్‌లోనే వంద రోజులు ఉండి నెగ్గినా గానీ ఇంతకంటే ఎక్కువ డబ్బయితే రాదుగా! దీంతో సోషల్ మీడియా అంతా కూడా మిథిలేష్ సరైన పనే చేశాడని మెచ్చుకుంటున్నారు.

అయితే మిథిలేష్ చాలా పెద్ద తప్పు చేశాడన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడానికి షో ఆర్గనైజర్స్ అష్టకష్టాలు పడుతున్నారు. ఎలిమినేట్ అయి బయటకొచ్చేసిన తర్వాత శివాజీతో చేసిన బజ్ ఇంటర్వ్యూలోనూ ఎందుకొచ్చావ్ బిగ్‌బాస్‌కి? అని ఇబ్బందిపెట్టే ప్రశ్నలు అడిగారు. కానీ మిథిలేష్ మాత్రం కూల్‌గా వచ్చిన పని అయిపోయింది అన్నట్లుగా సమాధానమిచ్చాడు.

ఇప్పటివరకు పది సీజన్లు జరిగితే అందులో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి ఎంతమంది టాప్-5కి వెళ్లారు? మీరే చెప్పండి అని ఉల్టా శివాజీకే మిథిలేష్ ఎదురుప్రశ్న వేశాడు. టాప్-5లో ప్రతి సీజన్‌లోనూ ఓ ఫిమేల్(సీరియల్ హీరోయిన్ లేదా సెలబ్రిటీ), ఓ ఎంటర్ టైనర్, మొదటి నుంచి మ్యానిపులేట్ చేసే వ్యక్తి ఉంటారని మిథిలేష్ చెప్పడం.. షో తీరు ఎలా ఉందో చెప్పకనే చెప్పింది. దీనిబట్టి చూస్తే మిథిలేష్ ఇలా చేస్తాడని అస్సలు ఊహించని బిగ్‌బాస్ టీమ్.. డబ్బుతో పాటు పరువు కూడా పోగొట్టుకున్నట్లే!

(ఇదీ చదవండి: వినాయక చవితి వల్ల ఇబ్బంది.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అల్లు శిరీష్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement