నా భర్తతో డేటింగ్ మొదలైంది అప్పుడే: హీరోయిన్ తాప్సీ | Taapsee Pannu calls getting married to Mathias Boe the best decision | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: ఆయనతో నా డేటింగ్ మొదలైంది అప్పుడే: తాప్సీ

Sep 28 2026 1:01 PM | Updated on Sep 28 2026 1:25 PM

Taapsee Pannu calls getting married to Mathias Boe the best decision

హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల గాంధారి మూవీతో ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్‌లో వచ్చిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో తాప్సీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఈ సందర్భంగా తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచే తాప్సీ.. తాజాగా రివీల్ చేసింది. తన భర్త మథియోస్ బోతో డేటింగ్ ఎప్పుడు మొదలైందనే విషయాన్ని వెల్లడించింది.

ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రముఖ కోచ్ మథియాస్ బోతో పెళ్లై మూడేళ్లయినా సందర్భంగా ఈ విషయాన్ని పంచుకుంది. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి అపారమైన గౌరవం ఉందని వెల్లడించింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అదే ఏడాదిలో అతనితో డేటింగ్ చేయడం మొదలుపెట్టానని తెలిపింది.. ఇన్నేళ్లుగా అతను నా హృదయానికి దగ్గరగా ఉన్నాడని.. ఎందుకంటే ఇంతకంటే మంచి వ్యక్తి నాకు దొరకడని నేను భావించానని పేర్కొంది. నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదేనని అనుకుంటున్నానని తెలిపింది.  ‍అయితే నా వృత్తి కూడా పూర్తిగా నా ఇష్టంతో ఎంచుకున్నది కాదు.. అది యాదృచ్ఛికంగా జరిగింది.. కాబట్టి భర్త ఎంపికలో చాలా గర్వపడుతున్నట్లు తాప్సీ ఆనందం వ్యక్తం చేసింది.

(ఇది చదవండి: రూ.2 కోట్లు పెడితే రూ.400 కోట్లు వచ్చాయి..!)

తాప్సీ మాట్లాడుతూ..'మేము 13 ఏళ్లుగా కలిసి ఉన్నాం. మా మధ్య అపారమైన భద్రతా భావం ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఒకరిపై ఒకరికి చాలా గౌరవం ఉంది. అది కూడా చాలా ఎక్కువ. ఆ తర్వాతే ప్రేమ వస్తుంది. ఒక బంధానికి గౌరవం కాకపోతే, ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు. సినీ పరిశ్రమలోనే వృత్తితో సంబంధం లేకుండా ప్రేమను పొందాలనుకునే నా సహచరులను చాలా మందిని నేను చూస్తున్నా. ఎందుకో నాకు అర్థం కావడం లేదు, మనం తాత్కాలిక ఆనందానికే ఎక్కువ విలువ ఇస్తున్నామా అనిపిస్తోంది. కానీ నా అనుభవం దీనికి పూర్తిగా భిన్నమైనది.” అని అన్నారు.

కాగా.. తాప్సీ 2013లో డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన 'చష్మే బద్దూర్' అనే కామెడీ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులోనూ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. బాలీవుడ్‌లో 'పింక్', 'బేబీ', 'నామ్ షబానా', 'థప్పడ్', 'మన్మర్జియాన్' సినిమాలతో పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవల 'అస్సీ', 'గాంధారి' చిత్రాలలో కనిపించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement