తమన్నా థ్రిల్లర్‌ మూవీ.. రెండు రోజుల్లో ఊహించని కలెక్షన్స్..! | Tamannah The Vvaan Box Office Collections on Day 2 | Sakshi
Sakshi News home page

Tamannah: తమన్నా థ్రిల్లర్‌ మూవీ.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Sep 27 2026 12:56 PM | Updated on Sep 27 2026 1:35 PM

Tamannah The Vvaan Box Office Collections on Day 2

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా వచ్చిన లేటేస్ట్ థ్రిల్లర్ మూవీ ది వాన్. ఈ చిత్రానికి దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్‌పై  శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది.

ఈ మూవీ రిలీజైన రెండు రోజుల్లోనే రూ.23 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని హీరోయిన్ తమన్నా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. గ్రామీణ నేపథ్యంలోనే హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా రాణిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ, అనూప్ సోని కీలక పాత్రల్లో నటించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement